యూనివర్సిటీపై చర్యలు తీసుకోవాలి. ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ,డిమాండ్.
ఏఐఎస్ఎఫ్,ఏలూరు జిల్లా అధ్యక్షులు డి. శివ కుమార్
ఎస్ఎఫ్ఐ , ఏలూరు జిల్లా కార్యదర్శి లెనిన్
ఏలూరు: ఏఐఎస్ఎఫ్, జిల్లా అధ్యక్షులు డి. శివకుమార్ మాట్లాడుతూ మోహన్ బాబు యూనివర్సిటీలో ఆర్థిక అరాచకాలు జరుగుతున్నాయని గత రెండు సంవత్సరాల నుంచి AISF, SFI చేసిన పోరాటానికి స్పందించి ఉన్నత విద్యా మండలి కమిషన్ మరియు హైకోర్టు స్పందించి విద్యార్థుల దగ్గర్నుంచి అధికంగా వసూలు చేసిన 26 కోట్ల రూపాయల ఫీజును తిరిగి విద్యార్థులకు చెల్లించాలని సూచించింది.
అదేవిధంగా విద్యార్థులు ఫీజులు పెండింగ్ ఉన్నాయని సర్టిఫికెట్లు ఆపినందుకు 16 లక్షల జరిమానా కూడా విధించింది. అయినప్పటికీ ఏమాత్రం నేను తగ్గేది లేదంటూ మోహన్ బాబు తమ బౌన్సర్లు అడ్డుపెట్టుకొని యూనివర్సిటీని నడిపిస్తున్నారని అన్నారు. మోహన్ బాబు యూనివర్సిటీ ఫీజులు దోపిడీపై తిరుపతి కలెక్టరేట్ వద్ద శాంతియుత నిరసన చేపట్టిన AISF, SFI, ఇతర విద్యార్థి సంఘాల నాయకులను మధ్యదరిలో అడ్డగించి ఎత్తుకెళ్లిన యూనివర్సిటీ బౌన్సర్లపై తక్షణమే క్రిమినల్ కేస్ పెట్టాలని మరియు మోహన్ బాబు యూనివర్సిటీ బౌన్సర్లు కిడ్నాప్లకు, దౌర్జన్యాలకు పాల్పడటం దుర్మార్గం అని అన్నారు,
ఎస్ఎఫ్ఐ, ఏలూరు జిల్లా కార్యదర్శి లెనిన్ మాట్లాడుతూ అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరినొకరు తిట్టుకుంటుంటే, ప్రైవేట్ శక్తులు చట్టాన్ని అతిక్రమిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయి, మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీ అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని, విద్యార్థి నేతలను తక్షణమే కనుక్కొని, బౌన్సర్లను అరెస్టు చేయాలనీ, విద్యార్థి సంఘ నాయకులకు ప్రాణహాని జరిగితే మోహన్ బాబే బాధ్యత వహించాలి డిమాండ్ చేసారు.
మోహన్ బాబు యూనివర్సిటీ పై చర్యలు తీసుకునేంతవరకు ఏలూరు జిల్లా వ్యాప్తంగా మంచు. మోహన్ బాబు, మంచు. విష్ణువుల విద్య సంస్థలకు బంద్ ప్రకటిస్తున్నట్లు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో "ఏఐఎస్ఎఫ్", నాయకులు సిద్ధూ, కృష్ణ, చంటి, ఎస్ఎఫ్ఐ నాయకులు ఎం. శివ, ఎం. జయంత్. అభి నాయకులు పాల్గొన్నారు.















Social Plugin