ఏలూరు జిల్లా, ముసునూరు: మండలం రమణక్కపేట గ్రామంలో ప్రేమ వివాహాన్ని అంగీకరించని యువతి కుటుంబ సభ్యులు ప్రేమికుడిపై దాడి చేసిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటన గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
బాధితుడు మండవల్లి మండలం కారుకొల్లు గ్రామానికి చెందిన సాయిచంద్. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, అదే గ్రామానికి చెందిన సాయి దుర్గతో తాను గత ఎనిమిదేళ్లుగా ప్రేమలో ఉన్నానని చెప్పారు. సాయి దుర్గ ప్రస్తుతం ముసునూరు మండలం రమణక్కపేటలో పోస్టు ఉమెన్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
ఇద్దరి ప్రేమను యువతి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో, ఏలూరులోని గంగానమ్మ ఆలయంలో వీరిద్దరూ వివాహం చేసుకున్నట్లు సాయిచంద్ తెలిపారు. అనంతరం ఈ వివాహానికి సంబంధించిన విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలిసింది.
దీంతో ఆగ్రహానికి గురైన యువతి తల్లిదండ్రులు రమణక్కపేటకు చేరుకుని, సాయిచంద్‌ను చూసి తీవ్ర ఆవేశంతో చెట్టుకు కట్టేసి రాళ్లు, కర్రలతో దాడి చేసినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ దాడిలో సాయిచంద్‌కు గాయాలయ్యాయి.
అంతటితో ఆగకుండా, యువతి సాయి దుర్గను బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు సమాచారం. ఘటనపై బాధితుడు సాయిచంద్ ఫిర్యాదు మేరకు ముసునూరు ఎస్సై చిరంజీవి కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
%20(1)_11zon.png)














Social Plugin