ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల: మండలం ద్వారకా తిరుమల గ్రామంలో హిందూ దేవత సీతామాతపై దుర్భాషలాడిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. హిందూ దుర్గ పరిరక్షణ సమితి, సర్వ దేవత ఉత్సవ కమిటీ సభ్యులు, ద్వారకా తిరుమల మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు కలిసి స్థానిక ఎస్సై టి.సుధీర్ బాబుకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు మేరకు నా అన్వేష్‌పై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. హిందూ విశ్వాసాలను కించపరిచే వ్యాఖ్యలు సహించబోమని హిందూ సంఘాల నేతలు స్పష్టం చేశారు. సీతామాతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేస్తూ నా అన్వేష్‌ను దేశ బహిష్కరణ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు మత సామరస్యాన్ని దెబ్బతీస్తాయని పేర్కొంటూ, భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.















Social Plugin