ప్రజాప్రతినిధులు, అతిరథ మహారథుల శుభాకాంక్షలతో పండుగ వాతావరణం
ఏలూరు జిల్లా, కొయ్యలగూడెం: మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ ఆవరణలో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా, అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు పోలవరం నియోజకవర్గం నలుమూలల నుంచి అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి ఎమ్మెల్యేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
వేదిక ప్రాంగణం మొత్తం పూల అలంకరణలు, బ్యానర్లు, ఫ్లెక్సీలతో పండుగ వాతావరణాన్ని తలపించింది. అతిరథ మహారథుల రాకతో కార్యక్రమం మరింత వైభవోపేతంగా మారింది. సర్వమత ప్రార్థనలతో ప్రారంభమైన ఈ వేడుకలు ప్రజల హర్షధ్వానాల మధ్య కొనసాగాయి.
పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకు పెద్దపీట వేశారు. ముందుగా మెగా ఉచిత వైద్య శిబిరాలు మరియు రక్తదాన శిబిరాలను ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రారంభించారు. వైద్య శిబిరాల్లో నిపుణులైన వైద్యులు ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను అందజేశారు. రక్తదాన శిబిరాల్లో యువత ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేసి మానవతా విలువలను చాటుకున్నారు.
శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన ప్రజలతో మార్కెట్ యార్డ్ ఆవరణ కిక్కిరిసిపోయింది. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తన సరళమైన స్వభావాన్ని మరోసారి నిరూపించారు.
ప్రజల ఆరోగ్య పరిరక్షణపై తన నిబద్ధతను చాటుతూ, పుట్టినరోజు సందర్భంగా అత్యవసర వైద్య సేవలను మరింత మెరుగుపరచే లక్ష్యంతో స్వంత నిధులతో ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్ సేవలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ అంబులెన్స్ సేవలు పోలవరం నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యవసర సమయాల్లో ఎంతో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు.
అనంతరం మహిళల్లో సాంస్కృతిక స్ఫూర్తిని, సృజనాత్మకతను ప్రోత్సహించే ఉద్దేశంతో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి మరియు పోటీల్లో పాల్గొన్న మహిళలందరికీ బహుమతులు అందజేశారు. మహిళల ఉత్సాహాన్ని ప్రశంసిస్తూ, ఇటువంటి కార్యక్రమాలు గ్రామీణ సంస్కృతిని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
అలాగే నియోజకవర్గంలోని అన్ని పంచాయతీల యువతకు వాలీబాల్ కిట్లను పంపిణీ చేసి, క్రీడల ద్వారా యువత శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని ఆయన అన్నారు. యువతను చెడు అలవాట్లకు దూరంగా ఉంచేందుకు క్రీడలు ఎంతో అవసరమని తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ, “ప్రజల ప్రేమాభిమానాలే నాకు నిజమైన పుట్టినరోజు కానుక. ప్రజల నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయకుండా నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తాను. పోలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందంజలో నిలిపేందుకు మీ అందరి సహకారం అవసరం” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో టైకార్ చైర్మన్ బోరగం శ్రీనివాసులు, ఎస్టి కమిషన్ చైర్మన్ జవహర్, జడ్పీ చైర్మన్ గంట పద్మశ్రీ,మాజీ ఎంపీ మాగంటి బాబు, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, షాప్ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వరి, జనసేన జిల్లా కార్యదర్శి ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, గడ్డమనగు రవికుమార్, ఎస్టి కమిషన్ మెంబర్ కాకి లక్ష్మి, బిజెపి జిల్లా ప్రెసిడెంట్ చౌటుపల్లి విక్రమ కిషోర్, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ పాదం కృష్ణ, టిడిపి నాయకులు దాకారపు కృష్ణ, కొయ్యలగూడెం సొసైటీ ప్రెసిడెంట్ దగ్గిన శ్రీనివాస్, కోన కుమార్ బాబు, మన్నిడి సాయిబాబా, పారేపల్లి రామారావు, సరిపెల్లి సత్యనారాయణ రాజు, పలు కార్పొరేషన్ డైరెక్టర్లు, సొసైటీ ప్రెసిడెంట్లు, కోటమి పార్టీలో మండల అధ్యక్షులు, అధికారులు, ప్రజలు, కోటమ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
అంగరంగ వైభవంగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పుట్టినరోజు వేడుకలు https://t.co/Oxzg8kRyZk
— ELURU NEWS (@EluruNews90170) January 8, 2026

.jpeg)


.jpeg)






























Social Plugin