ఒమేగా అను హాస్పిటల్ ఆధ్వర్యంలో గ్రామీణ వైద్యుల ఆత్మీయ సమ్మేళనం
ఏలూరు జిల్లా, నూజివీడు, ప్రతినిధి: నూజివీడు డివిజన్ పరిధిలోని నూజివీడు, ముసునూరు, ఆగిరిపల్లి మండలాల గ్రామీణ వైద్యులకు బుధవారం (24-12-2025) ఒమేగా హాస్పిటల్ ఆధ్వర్యంలో అవగాహన శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యూరాలజిస్టు డాక్టర్ సౌయ్య గారు, ఆంకాలజిస్ట్ డాక్టర్ ఆదిత్య గారు ముఖ్య అతిథులుగా పాల్గొని, నరాల సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ లక్షణాలు, ప్రాథమిక స్థాయిలో గుర్తింపు, సమయానికి చికిత్స అవసరం వంటి అంశాలపై విపులంగా వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులు ఎదుర్కొనే సమస్యలు, రోగులను సరైన సమయంలో ఉన్నత వైద్య కేంద్రాలకు రిఫర్ చేయాల్సిన అవసరాన్ని కూడా వారు తెలియజేశారు.
ఈ శిక్షణా తరగతుల్లో జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, నూజివీడు ఏరియా నాయకులు, సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ తరహా అవగాహన కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.
















Social Plugin