సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నేరస్తుని పట్టుకోవచ్చు..
తప్పుచేసిన ముద్దాయిలు తప్పించుకోలేరు..
బాధితులు ఎవరైనా ఇబ్బందికి గురైతే తమకు నేరుగా సంప్రదించవచ్చు..
ఏలూరు జిల్లా,చింతలపూడి: జిల్లా ఎస్పీ సహకారంతో సాంకేతిక పరిజ్ఞానంతో ఎలాంటి ముద్దాయిని పట్టుకుంటామని, మానసిక వైకల్యం కలిగిన మహిళపై అత్యాచారం చేసిన ముద్దాయిని పట్టుకున్నట్లు జంగారెడ్డిగూడెం ఇంచార్జి డి యస్ పి యూ రవి చంద్ర తెలిపారు. చింతలపూడి మండలం సీఐ కార్యాలయం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన తెలిపిన వివరాలు ప్రకారం.. చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామానికి చెందిన 19 సంవత్సరాల మహిళా మానసిక వైకల్యం కలదాని అదే గ్రామానికి చెందిన వ్యక్తి ఎవరు పట్టుకోలేరని, ఆమె చెప్పలేదని, ఆమె తల్లితండ్రులు ఇంట్లో ఎవరు లేని సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపారు. ఇలా అనేకమార్లు, ఆ మహిళపై అత్యాచారం చేశారని, ఆ మహిళను బలవంతంగా శారీరకంగా అనుభవించాడని తెలిపారు.
రెండు నెలల తర్వాత నెలసరి కావడం లేదని బాధితురాలిని తల్లిదండ్రులు దగ్గర్లోని ఆసుపత్రి తీసుకెళ్ళు చూపించగా రెండవ నెల గర్భవతి అని తెలిసిందని సరైన వైద్య నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించడం జరిగింది తెలిపారు. ఆమె మానసికంగా వైకల్యం కలిగినదని ఎవరు పట్టుకోలేరని అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపారు. చింతలపూడి సీఐ ఎస్సై లతో కలసి రెండు టీంలు ఏర్పాటు చేసినాట్లు తెలిపారు.
చుట్టుపక్కల పోలీసులు విచారణ చేస్తున్న తనకి తెలియనట్లుగా ఎవరు పట్టుకోలేని దిమాతో ఉన్నాడని, జిల్లా ఎస్పీ ఆదేశాలతో జంగారెడ్డిగూడెం ఎస్పీ సుస్మిత రామ్ నందన్ పర్యవేక్షణలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి, డిఎన్ఏ పరీక్షల ద్వారా నేరస్తుని నిర్ధారించి మంగళవారం ఉదయం అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. తప్పుచేసి ముద్దాయిలు తప్పించుకోవాలని చూసిన, సాంకేతిక పరిజ్ఞానంతో ముద్దాయిలను కచ్చితంగా పట్టుకుంటామని, దానికి ఎవరు మినహాయింపు కాదని హెచ్చరించారు.
ఈ సందర్భంగా బాధితులు ఎవరైనా ఇబ్బందికి గురైతే తమకు నేరుగా సంప్రదించవచ్చని తెలిపారు. అదేవిధంగా సైబర్ నేరాలకు దూరంగా ఉండాలని, ఆన్లైన్ లింక్స్, పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచి నేరస్థుని, పట్టుకున్న చింతలపూడి సీఐ క్రాంతి కుమార్ ఎస్సై సతీష్ కుమార్, సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి సిఐ క్రాంతికుమార్ ఎస్ఐ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
_11zon_11zon.png)














Social Plugin