జీలుగుమిల్లి: జీలుగుమిల్లి మండలం తాటియకులగూడెం గ్రామానికి చెందిన జనసేన వార్డు మెంబర్ అమృతపల్లి రవి సోదరుడు అమృతపల్లి జగ్గారావు అకాలంగా మృతి చెందడం పట్ల పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ విషాద వార్త తెలిసిన వెంటనే ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మృతుని నివాసానికి చేరుకుని మృతదేహాన్ని సందర్శించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి దుఃఖాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పిస్తూ, ఈ కఠిన సమయంలో పార్టీ తరఫునతో పాటు వ్యక్తిగతంగా కూడా తాను కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
మాట్లాడుతూ, అమృతపల్లి జగ్గారావు అకాల మరణం కుటుంబానికి తీరని లోటని పేర్కొన్న ఎమ్మెల్యే, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులు ఈ విషాదాన్ని అధిగమించేలా భగవంతుడు శక్తిని ప్రసాదించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జనసేన మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము, తెలుగుదేశం పార్టీ మండల ప్రెసిడెంట్ సంకవల్లి సాయి, బీజేపీ మండల ప్రెసిడెంట్ గుడ్ల రాంబాబు, తాటియకులగూడెం సర్పంచ్ వనమా రాంబాబు, గ్రామ జనసేన ప్రెసిడెంట్ రాయి సుబ్బారావు, గంధం వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ నాలి శ్రీనివాస్, కోల మధు, చిర్రి శ్రీనివాస్, తోట బాలు తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.















Social Plugin