జంగారెడ్డిగూడెం రూరల్, దేవులపల్లి: మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లిలో టీడీపీ శ్రేణులు భారీగా ఆందోళనకు దిగాయి. ఈ సందర్భంగా అంబటి రాంబాబు దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి అనంతరం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
మండల టీడీపీ అధ్యక్షులు కుక్కల మాధవరావు ఆధ్వర్యంలో దేవులపల్లి ప్రధాన రహదారిపై ఈ నిరసన కార్యక్రమం జరిగింది. అంబటి రాంబాబు వ్యాఖ్యలను ఖండిస్తూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు ఫోటోలను ప్రదర్శిస్తూ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏలూరు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు రావూరి కృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి బొబ్బర్ బాలరాజు, టీడీపీ నాయకులు దాకారపు కృష్ణ, సీనియర్ నాయకులు గోలి అనిల్ మాట్లాడుతూ… 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు వంటి నాయకుడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.
సీనియర్ నాయకులు గోలి అనిల్ మాట్లాడుతూ, వైసీపీ నాయకులు తమ మాటలను అదుపులో పెట్టుకోకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. గత ఎన్నికల్లో 11 స్థానాలకు మాత్రమే పరిమితమైన వైసీపీ, భవిష్యత్తులో మరింత రాజకీయంగా బలహీనపడే పరిస్థితి ఎదుర్కొంటుందని వ్యాఖ్యానించారు.
నిరసన అనంతరం లక్కవరం ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదుపరి స్థానిక పోలీస్ స్టేషన్‌లో అంబటి రాంబాబుపై ఫిర్యాదు చేసినట్లు నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దేవులపల్లి టీడీపీ అధ్యక్షులు రవి, వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.















Social Plugin