ఏలూరు జిల్లా,నూజివీడు: నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం కొర్లగుంట గ్రామంలో రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారథి గారు ముఖ్య అతిథిగా హాజరై రైతులకు పాస్‌పుస్తకాలను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా పనిచేస్తోందన్నారు. రైతుల భూమి హక్కులకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో పూర్తి పారదర్శకతతో రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
పట్టాదారు పాస్‌పుస్తకాలు రైతులకు చట్టబద్ధమైన భద్రతను కల్పించడమే కాకుండా, బ్యాంకు రుణాలు పొందేందుకు, ప్రభుత్వ పథకాల లబ్ధి అందుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయని మంత్రి వివరించారు. గతంలో ఉన్న లోపాలను సరిదిద్దుతూ, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, పార్టీ నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.















Social Plugin