ఏలూరు జిల్లా,చింతలపూడి: ఏలూరు జిల్లా చింతలపూడిలోని భాష్యం హైస్కూల్‌లో నిర్వహించిన చెస్ కాంపిటీషన్‌లో లింగపాలెం మండల కేంద్రానికి చెందిన విద్యార్థి ప్రతిభను చాటాడు. అండర్–11 కేటగిరీలో జరిగిన పోటీల్లో లింగపాలెం చైతన్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుని అభినందనలు అందుకున్నాడు.
లింగపాలెం చైతన్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్‌లో 5వ తరగతి చదువుతున్న బి. సంజయ్ (సుదీర్ కుమారుడు) ఈ చెస్ కాంపిటీషన్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి ఫస్ట్ ప్లేస్ సాధించాడు. పోటీలంతా ధైర్యంగా, వ్యూహాత్మకంగా ఆడి విజేతగా నిలిచాడు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ సిహెచ్. శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ సిహెచ్. విజయలక్ష్మి మాట్లాడుతూ… చదువుతో పాటు క్రీడల్లోనూ సంజయ్ ఇంతటి ప్రతిభ చూపడం గర్వకారణమని కొనియాడారు. ఇలాంటి విజయాలు ఇతర విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు.
అనంతరం పాఠశాల ఉపాధ్యాయ బృందం సంజయ్‌ను ప్రత్యేకంగా అభినందించి, భవిష్యత్తులో జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు















Social Plugin