ఆర్టీసీ ఎండీ శ్రీ ద్వారకా తిరుమల రావు గారి పదవీ విరమణ అభినందన సభ..


ముఖ్య అతిథిగా హాజరై శుభాకాంక్షలు తెలియజేసిన ఏపీఎస్ఆర్టీసీ జోన్ 2 చైర్మన్ శ్రీ రెడ్డి అప్పల నాయుడు..


విజయవాడ,  జనవరి 31: ఏపీఎస్ ఆర్టీసీలో ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ ద్వారకా తిరుమల రావు పదవీ విరమణ అభినందన సభ శనివారం విజయవాడ ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు హాజరై ఉద్యోగ విరమణ చేస్తున్న ఎండీ శ్రీ ద్వారకా తిరుమల రావు ఆర్టీసీకి చేసిన సేవలు అనిర్వచనీయమని కొనియాడారు. 

అనంతరం శ్రీ ద్వారకా తిరుమల రావుని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.. నీతి నిజాయితీతో ఇంతకాలం వారు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారన్నారు.. పదవీ విరమణ అనంతరం వారు ఆయురారోగ్యాలతో భగవంతుని ఆశీస్సులతో గడపాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు..