ఏలూరు జిల్లా, జనవరి 31: భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంత్ శిరోమణి గురు రవిదాస్ గారి 649వ జయంతి వేడుకలు శనివారం టీ. నరసాపురం మండలంలోని తిరుమల దేవిపేట గ్రామ పంచాయతీ, ఎస్సీ పేటలో ఘనంగా నిర్వహించారు.
రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ, సంఘటన మంత్రి మధుకార్ జీ, రాష్ట్ర దళిత మోర్చా అధ్యక్షులు పడతల సురేష్, ఏలూరు జిల్లా అధ్యక్షులు సీహెచ్ విక్రమ్ కిషోర్, ఏలూరు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు బుర్రి శ్రీకర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని రాయల నాగ మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా చర్మకార వృత్తికి చెందిన వసంతవాడ మద్ది రామయ్యని ఘనంగా సన్మానించారు. సంత్ గురు రవిదాస్ గారి బోధనలు సమాజంలో సమానత్వం, మానవత్వం, కుల వివక్ష నిర్మూలనకు దారిచూపుతాయని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పీవీఎస్‌ఎస్ రామలింగేశ్వరరావు, ఏలూరు జిల్లా ఎస్సీ మోర్చా జనరల్ సెక్రటరీ రాయల నాగ మల్లేశ్వరరావు, జిల్లా కిసాన్ మోర్చా సెక్రటరీ చిక్కుల వెంకటేశ్వరరావు, మండల వైస్ ప్రెసిడెంట్ గంగేటి బద్రి, టీ. నరసాపురం మండల యువ మోర్చా అధ్యక్షులు చిలకా వినయ్ కుమార్, పప్పు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
సంత్ గురు రవిదాస్ జయంతి వేడుకలకు రాష్ట్రంలో ముందడుగు – రాయల నాగమల్లేశ్‌కు అభినందనలు
సంత్ గురు రవిదాస్ గారి 649వ జయంతి వేడుకలను రాష్ట్రంలో తొలుత ప్రారంభించిన ఏలూరు జిల్లా దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి రాయల నాగమల్లేశ్‌కు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తరఫున హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ, సంఘటన మంత్రి మధుకార్ జీ, రాష్ట్ర దళిత మోర్చా అధ్యక్షులు పడతల సురేష్, జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు.















Social Plugin