ఏలూరు జిల్లా, ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రి మరియు గౌరవ ఉప ముఖ్యమంత్రి నిరంతర ప్రోత్సాహంతో CAMPA పథకం కింద ఏలూరు అటవీ విభాగానికి మొత్తం 13 వాహనాలు కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ వాహనాలను టెరిటోరియల్ మరియు వైల్డ్ లైఫ్ విభాగాలకు కేటాయించినట్లు వెల్లడించారు.
అటవీ సంరక్షణ, అటవీ రక్షణ, అగ్నిప్రమాదాల నియంత్రణ, అక్రమ చెట్ల కొట్టివేత నివారణ, వన్యప్రాణుల సంరక్షణతో పాటు క్షేత్రస్థాయిలో వేగవంతమైన పర్యవేక్షణ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడంలో ఈ వాహనాలు కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు పేర్కొన్నారు.
కొత్త వాహనాల ద్వారా అటవీ అధికారులు, సిబ్బంది దూర ప్రాంతాలకు సులభంగా చేరుకొని తమ విధులను వేగంగా, సమర్థంగా నిర్వహించగలుగుతారని తెలిపారు. దీంతో అటవీ పరిరక్షణ చర్యలు మరింత బలోపేతం కానున్నాయని చెప్పారు.
ప్రజల భాగస్వామ్యంతో అటవీ వనరుల పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, పర్యావరణ సమతుల్యతను కాపాడడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని జిల్లా అటవీ శాఖాధికారి పేర్కొన్నారు. CAMPA నిధులను సద్వినియోగం చేస్తూ అటవీ పరిరక్షణకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖకు ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని ఆయన తెలిపారు.















Social Plugin