బాల్యవివాహాల నిరోధ అంశంపైన గోడ పత్రికలను - జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి యస్.శ్రీదేవి లాంఛనంగా ప్రారంభించారు ...
ఏలూరు జిల్లా, ఏలూరు: రాష్ట్ర న్యాయ సేవాధికారసంస్థ అమరావతి వారి ఆదేశాలు ప్రకారం ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా డిసెంబరు 03వ తేదీ నుండి 100 రోజులపాటు బాల్య వివాహాల నిరోధంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికారసంస్థ చైర్పర్సన్ మరియు జిల్లాప్రధాన న్యాయమూర్తి శ్రీమతి యస్. శ్రీదేవి తెలియచేశారు. అందులో భాగంగా మంగళవారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ భవనమునందు బాల్యవివాహాల నిరోధంపై ప్రజలను అవగాహన కలిగించడం కోసం గోడపత్రికలను ఆవిష్కరించామని అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి యస్. శ్రీదేవి మాట్లాడుతూ బాల్యవివాహ రహిత భారతదేశంగా తయారు చేయడమే దీని యొక్క ముఖ్యమని, ఈ బాల్య వివాహాలను నిరోధించడం కోసం అన్ని శాఖలతో పాటు న్యాయ సేవాధికార సంస్థలు కూడా విశేష కృషి చేస్తున్నాయని తెలిపారు. అయినప్పటికీ తరచుగా బాల్యవివాహాలు నిర్వహించడం జరుగుతుందని, బాల్యవివాహాలు చేయటం వల్ల బాలికలు ఎదుగుదల సరిగా లేక అనారోగ్యాలకు గురవడం జరుగుతుందని తెలిపారు.
తద్వారా పుట్టేబిడ్డ బలహీనముగా పుట్టడం జరుగుతుందిని, తద్వారా అనేక అనాఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని అన్నారు. కావున బాల్యవివాహాలను నిరోధించి బాలల భవిష్యత్తు కోసం కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు. బాల్యవివాహాలు ప్రోత్సహించినా, జరిపించినను చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు. ముందుగా సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని, సమాజానికి ఎంతో మేలు చేసిన వారు అవుతారని అన్నారు.
కార్యక్రమంలో పర్మినెంటు లోక్ అథాలత్ చైర్ పర్సన్ ఏ.మేరీ గ్రేస్ కుమారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాదు, బార్ సోసియేషన్ ప్రెసిడెంటు కొనే సీతారాం, తదితరులు పాల్గొన్నారు.















Social Plugin