ఏలూరు జిల్లా, ఏలూరు: జిల్లా ఉపాధి కార్యాలయం, నేషనల్ కెరీర్ సర్వీస్ (NCS) – ఏలూరు ఆధ్వర్యంలో ఈ నెల 12 జనవరి 2026న ఉదయం 10:00 గంటలకు జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి పి.వి. రమేష్ కుమార్ తెలిపారు. ఈ జాబ్ డ్రైవ్ జిల్లా ఉపాధి కార్యాలయం, ఏలూరు ప్రాంగణంలో జరుగుతుందని వెల్లడించారు.
ఈ జాబ్ డ్రైవ్‌లో Gourmet Popcornica Pvt. Ltd కంపెనీ పాల్గొని అభ్యర్థుల ఎంపిక చేపడుతుందని తెలిపారు. SSC నుంచి డిగ్రీ వరకు, ITI (ఎలక్ట్రిషియన్ & ఫిట్టర్), అలాగే MBA పూర్తి చేసిన పురుషులు, మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చన్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఫిట్టర్లు, ఎలక్ట్రిషియన్లు, ఫోర్క్‌లిఫ్ట్ డ్రైవర్లు, ట్రెయినీ – హెచ్‌ఆర్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.10,000 నుంచి రూ.15,000 వరకు జీతం ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు ఫార్మల్ డ్రస్ కోడ్‌లో హాజరుకావాలని, అవసరమైన డాక్యుమెంట్లు మరియు రిజ్యూమ్ తీసుకురావాలని సూచించారు.
రిజిస్ట్రేషన్ కోసం అభ్యర్థులు [https://bit.ly/ncsregister-wg](https://bit.ly/ncsregister-wg) లింక్ ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాల కోసం 8886882032, 7416118388, 9121109809 నంబర్లను సంప్రదించవచ్చని, అలాగే https://employment.ap.gov.in వెబ్‌సైట్‌లో కూడా సమాచారం అందుబాటులో ఉందని జిల్లా ఉపాధి అధికారి తెలిపారు.















Social Plugin