జంగారెడ్డిగూడెంలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
కేక్ కట్ చేసిన పట్టణ టిడిపి అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్
ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం: యువనేత, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యా–ఐటీ శాఖల మంత్రివర్యులు నారా లోకేష్ జన్మదిన వేడుకలను జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణ టిడిపి అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ ఆధ్వర్యం వహించారు.
ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ మాట్లాడుతూ, నారా లోకేష్ ముందుచూపు, దూరదృష్టి వల్లే నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఐటీ కంపెనీలు, పరిశ్రమలు రాష్ట్రానికి రావడంలో మంత్రి లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని, యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విక్రమార్కుడిలా నిరంతరం శ్రమిస్తున్న నాయకుడని ప్రశంసించారు.
జన్మదిన వేడుకలలో భాగంగా కొండ్రెడ్డి కిషోర్‌తో పాటు సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం ఒకరికొకరు కేక్ తినిపించుకుంటూ ఆనందోత్సాహాలతో వేడుకలు నిర్వహించారు. కార్యక్రమం మొత్తం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.
ఈ సందర్భంగా పలువురు సీనియర్ నాయకులు మాట్లాడుతూ, నారా లోకేష్ భవిష్యత్ కాలానికి మార్గదర్శి అని అభిప్రాయపడ్డారు. తాత ఎన్టీఆర్, తండ్రి నారా చంద్రబాబు నాయుడు వారసత్వాన్ని పునికిపుచ్చుకుని పార్టీ క్యాడర్‌ను సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పరిమి సత్తి పండు, మండవ లక్ష్మణరావు, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, పాకనాటి ఝాన్సీరాణి, రావూరి కృష్ణ, ప్రధాన కార్యదర్శి కోనేటి చంటి, బొబ్బర రాజ్ పాల్ కుమార్, మారిశెట్టి సత్యనారాయణ, చెరుకూరి శ్రీధర్, పాతూరి అంబేద్కర్, కౌన్సిలర్ తెలగారపు జ్యోతి, గుల్లపూడి శ్రీదేవి, గుమ్మడి ప్రసాద్, మద్దిపాటి నాగేశ్వరావు, తూటికుంట రాము, మహంకాళి రాంబాబు, షేక్ యాకుబ్, దాకవరపు కృష్ణ, ఇనగడప రామాంజనేయులు, చిట్రోజు తాతాజీ, బూరుగుపల్లి సూరిబాబు, మిడత పెంటయ్య, షేక్ నజీర్, గెడా సుబ్రహ్మణ్యం, కొంచాడ ప్రసాద్, కంచర్ల రమేష్, కరణం రాంబాబు, మహ్మద్ రఫీ, పాకనాటి కాశీ, శీలం గోపి, మార్గాని వినూతన, శీలామంతుల రాంబాబు, మన్యం దుర్గారావు, కొత్తూరి బోస్, ముప్పిడి విష్ణు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.















Social Plugin