డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆలమూరు: నారద ప్రతిష్టిత నవ జనార్ధన ఆలయాల్లో ప్రముఖమైన ఆలమూరు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ జనార్ధన స్వామివారి 2026 వార్షిక కల్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికను శుక్రవారం ఆలయ ప్రాంగణంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ బైరిశెట్టి రాంబాబు, ఆలయ అర్చకులు అంగర భగవానాచార్యులు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చైర్మన్ బైరిశెట్టి రాంబాబు మాట్లాడుతూ, ఈనెల 27వ తేదీ మంగళవారం సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు కల్యాణోత్సవ కార్యక్రమాలకు అంకురార్పణ జరుగుతుందని తెలిపారు. బుధవారం గరుడ వాహనంపై స్వామివారి ఊరేగింపు అనంతరం రాత్రి స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.
గురువారం భీష్మ ఏకాదశి సందర్భంగా భక్తుల కోలాహల మధ్య రథోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తామని తెలిపారు. అలాగే శుక్రవారం, శనివారం, ఆదివారం రోజులలో వివిధ వాహన సేవలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సోమవారం పుష్పోత్సవంతో ఈ వార్షిక మహోత్సవాలు ముగుస్తాయని తెలిపారు.
భక్తులంతా పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవుతూ, ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని దేవస్థానం చైర్మన్ కోరారు.
ఈ సందర్భంగా ఆహ్వాన శుభ పత్రికలను కొత్తూరు సెంటర్‌కు చెందిన శ్రీ శంకర డెంటల్ క్లినిక్ అధినేత డాక్టర్ రమేష్ అందజేశారు. ఆయనను దేవస్థానం చైర్మన్ బైరిశెట్టి రాంబాబు, చిన్నం సుబ్బలక్ష్మి, అయినవిల్లి శ్రీనివాస్, అంగర భగవానాచార్యులు అభినందించారు.
----------------------------------------------------------------------------------------------------------------------------

















Social Plugin