ఏలూరు జిల్లా, ఏలూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థకు చైర్మన్‌గా శుక్రవారం ఏలూరులో జుత్తుగ నాగరాజు నియమితులయ్యారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం. శేఖర్ బాబు, గ్రంథాలయ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు.
అనంతరం నూతన చైర్మన్ జుత్తుగ నాగరాజు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో పనిచేస్తున్న గ్రంథాలయ సిబ్బందితో ముచ్చటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తానని, అవసరమైతే మంత్రుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారమయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా నూతన భవన నిర్మాణం, సెస్ బకాయిలు, ఉద్యోగుల సమస్యలు, శాలరీ గ్రాంట్ తదితర అంశాలపై కార్యదర్శిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయ వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పని చేస్తానని తెలిపారు. తదుపరి నూతన చైర్మన్ జుత్తుగ నాగరాజును ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఏలూరు జనసేన ఇన్‌ఛార్జి, ఏపీఎస్ఆర్టీసీ రీజినల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, డిప్యూటీ లైబ్రేరియన్ ఎ. నారాయణరావు, జిల్లాలో పనిచేస్తున్న గ్రంథాలయ అధికారులు, జనసేన పార్టీ నాయకులు, మీడియా ప్రతినిధులు, ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా జుత్తుగ నాగరాజు బాధ్యతలు స్వీకరణ https://t.co/1IgtVWY7Y6
— ELURU NEWS (@EluruNews90170) January 9, 2026
.jpeg)














Social Plugin