భారత రాజ్యాంగంలో ఎస్సీ,ఎస్టీ వర్గాలకు కల్పించిన హక్కులను కాపాడటంలో నిర్లక్ష్యం చేసిన అధికార్లుపై చర్యలు తప్పవు.
ప్రజాధర్భార్ లో ప్రజలు నుండి వచ్చిన అర్జీలను అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టి పరిష్కారం చెయ్యాలి.
ప్రజాధర్భార్ కు విశేష స్పందన ప్రజలు, అసోసియేషన్ ప్రతినిధులు నుండి విజ్ఞప్తులు స్వీకరణ.
రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమీషన్ చైర్మన్ కె.ఎస్.జవహర్ ...
ఏలూరు జిల్లా, ఏలూరు: స్థానిక రెవెన్యూ అతిథిగృహంలో శుక్రవారం రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ ఆధ్వర్యంలో ప్రజాధర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్. జవహర్ ప్రజలు, వివిధ అసోసియేషన్ ప్రతినిధుల నుండి అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, రాజ్యాంగ పరిరక్షణ, ప్రభుత్వ చట్టాలు, నోటిఫికేషన్లు తదితర అంశాలపై పర్యవేక్షణ చేసే పూర్తి అధికారం ఎస్సీ కమిషన్‌కు ఉందన్నారు. భారత రాజ్యాంగం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కల్పించిన హక్కులను కాపాడటంతో పాటు, వాటి అమలులో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కమిషన్ స్పందించి ప్రభుత్వానికి చర్యల కోసం సిఫార్సు చేస్తుందని తెలిపారు.
రాష్ట్రంలో 2018 తరువాత ఎస్సీ కమిషన్ సక్రమంగా పనిచేయలేదని, దీంతో ఎస్సీ వర్గాల ప్రజలు, సంఘాల సమస్యలు పెండింగ్‌లోనే ఉన్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో కొత్తగా ఎస్సీ కమిషన్ ఏర్పడిందని, కమిషన్‌కు మళ్లీ పూర్వ వైభవం తీసుకువస్తామని స్పష్టం చేశారు.
ఏలూరు జిల్లాలో ఎస్సీ అట్రాసిటీ కేసులు 34, భూసంబంధిత కేసులు 22, సాధారణ కేసులు 21 పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. కొందరు అధికారులు ఫోన్ చేసినప్పుడు మీటింగ్‌లో ఉన్నామని చెప్పి, తర్వాత తిరిగి స్పందించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. పోలవరం తహసీల్దారుకు పంపిన రెండు కేసులు ఇప్పటికీ పరిష్కారం కాలేదని పేర్కొన్నారు.
ఇలాంటి నిర్లక్ష్య ఘటనలు పునరావృతమైతే కమిషన్ తీవ్రంగా పరిగణిస్తుందని హెచ్చరించారు. ఏ ప్రభుత్వ అధికారి అయినా ఉద్దేశపూర్వకంగా విధులు నిర్వర్తించకపోయినా, అలసత్వం వహించినా వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. అవసరమైతే నిర్లక్ష్యం వహించిన అధికారులను కమిషన్‌కు పిలిపించి విచారణ నిర్వహిస్తామని అన్నారు.
ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఎక్కడైనా కులవివక్షకు పాల్పడినా లేదా సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం చూపినా కమిషన్ కఠినంగా స్పందిస్తుందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలు అమలు కావడం లేదనిపిస్తే కమిషన్ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల ఫలాలు అర్హులకు అందేలా పర్యవేక్షణ చేయడం కమిషన్ బాధ్యత అని, ఇందులో లోపాలు తలెత్తితే చర్యలు తప్పవని చైర్మన్ కె.ఎస్. జవహర్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏపీ ఎస్సీ కమిషన్ కార్యదర్శి చిన్న రాముడు, ఏపీ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, జిల్లా సాంఘీక సంక్షేమ శాఖ డీడీ వై. విశ్వమోహన్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ యం. ముక్కంటి, తహసీల్దారు కె. గాయత్రిదేవి, సంబంధిత అధికారులు, ప్రజలు, అసోసియేషన్ ప్రతినిధులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
నిర్లక్ష్య అధికారులపై చర్యలు తప్పవు : చైర్మన్ కె.ఎస్. జవహర్ హెచ్చరిక https://t.co/k5L4H0rIse
— ELURU NEWS (@EluruNews90170) January 9, 2026















Social Plugin