ఏలూరు జిల్లా, ద్వారకా తిరుమల/దొరసానిపాడు: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగు చలన చిత్ర రంగంలో రారాజుగా పేరొందిన శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా దొరసానిపాడు గ్రామంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ గారి సేవలను, ఆయన ప్రజల కోసం చేసిన కృషిని నాయకులు గుర్తు చేసుకున్నారు. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేతగా ఎన్టీఆర్ చరిత్రలో నిలిచిపోతారని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పసుమర్తి సోమశేఖర్, ఎంపీటీసీ అల్లాడ రామకృష్ణ, గోపాలపురం నియోజకవర్గం విభిన్న ప్రతిభావంతుల విభాగం అధ్యక్షులు లక్కాబత్తుల రమేష్ పాల్గొన్నారు. అలాగే గ్రామ కమిటీ అధ్యక్షులు మద్దిపాటి రత్నాజీ, ఉపాధ్యక్షులు మిడతా రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి లక్కాబత్తుల రాజు పాల్గొని నివాళులు అర్పించారు.
అలాగే అల్లాడ గిరి, మద్దిపాటి శీను, లక్కాబత్తుల రాంబాబు, రాయపాటి గాంధీ, లక్కాబత్తుల రాజారావు, కలకండ రత్తయ్య, లింగంకుంట నర్సయ్యతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

.jpeg)














Social Plugin