కొయ్యలగూడెం మండలంలో వైఎస్ఆర్‌సీపీ నేతల పరామర్శలు, సమావేశాలు


కొయ్యలగూడెం మండలంలో వైఎస్ఆర్‌సీపీ నేతల పరామర్శలు, సమావేశాలు
బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పిన మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు


పోలవరం నియోజకవర్గం / కొయ్యలగూడెం, జనవరి 24: పోలవరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మరియు ఇంచార్జ్ తెల్లం బాలరాజు శనివారం కొయ్యలగూడెం మండలంలో విస్తృతంగా పర్యటించారు. సుడిగాలి పర్యటనలో భాగంగా వివిధ గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.

కొయ్యలగూడెం గ్రామంలో వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు రామాంజనేయులు కుమారుడు మృతి చెందిన విషయం తెలుసుకొని ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే పార్టీ సీనియర్ కార్యకర్త హనుమంతు ప్రమాదానికి గురైనట్లు తెలుసుకొని ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. మరో కార్యకర్తకు కాలు విరిగిన నేపథ్యంలో ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు.

అలాగే కుంట్లగూడెం గ్రామంలో ఇటీవల మృతి చెందిన వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు సుబ్బారావు చిత్రపటానికి పూలదండ వేసి మౌనం పాటించి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో కొయ్యలగూడెం మండలం ఎంపీపీ గంజిమాల రామారావు, రాష్ట్ర నాయకులు గంటా శ్రీను, మండల పార్టీ అధ్యక్షుడు తుమ్మలపల్లి గంగరాజు, టౌన్ పేషంట్ నూకల రాము, పోలవరం మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ బాజీ, వాణిజ్యభాగం అధ్యక్షుడు బుజ్జిబాబు, మండల యూత్ ప్రెసిడెంట్ రాంబాబు తదితర స్థానిక నాయకులు పాల్గొన్నారు.

అదేవిధంగా, ఏలూరు జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా నాయకుడు చిక్కాల దుర్గాప్రసాద్ ఇటీవల ప్రమాదానికి గురైన విషయం తెలుసుకొని ఆయనను కూడా తెల్లం బాలరాజు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంజిమాల రామారావు, రాష్ట్ర నాయకులు గంటా శ్రీను, మండల పార్టీ అధ్యక్షుడు తుమ్మలపల్లి గంగరాజు, వాణిజ్యభాగ అధ్యక్షుడు బుజ్జిబాబు, మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ బాజీ, రాజేష్, మహేష్, రవి, చంటి తదితరులు పాల్గొన్నారు.

తదుపరి కనకాద్రిపురం గ్రామంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో పాల్గొన్న తెల్లం బాలరాజు మాట్లాడుతూ, పోలవరం నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల్లో స్థానిక కమిటీల నుంచి మండల కమిటీల వరకు త్వరితగతిన ఏర్పాటు చేయాలని పార్టీ అధ్యక్షులు, నాయకులకు సూచించారు. అలాగే కార్యకర్తల ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, ఫోన్ నెంబర్ తదితర వివరాలతో బయోడేటా పూర్తి చేసి మండల అధ్యక్షులకు అందజేయాలని కోరారు.

ఈ సమావేశంలో కొయ్యలగూడెం మండలం ఎంపీపీ గంజిమాల రామారావు, రాష్ట్ర నాయకుడు గంటా శ్రీను, మండల పార్టీ అధ్యక్షుడు తుమ్మలపల్లి గంగరాజు, వాణిజ్యభాగ అధ్యక్షుడు బుజ్జిబాబు, మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ బాజీ, యూత్ ప్రెసిడెంట్ రాంబాబు, స్థానిక నాయకులు బాలస్వామి, సుధాకర్, కృష్ణ, శివ తదితరులు పాల్గొన్నారు.