ఏపీ జేఏసీ అమరావతి 4వ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలి


ఏపీ జేఏసీ అమరావతి 4వ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలి
ఏలూరులో పోస్టర్ ఆవిష్కరణ – ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపు


ఏలూరు, జనవరి 24: ఫిబ్రవరి 5వ తేదీన విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగనున్న ఏపీ జేఏసీ అమరావతి 4వ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ శనివారం ఏలూరు రెవిన్యూ భవన్‌లో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఏపీ జేఏసీ అమరావతి ఏలూరు జిల్లా చైర్మన్ కె. రమేష్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర మహాసభకు ఏలూరు జిల్లాలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సచివాలయ ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్లు, కాంట్రాక్టు మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు.

మహాసభకు హాజరయ్యేందుకు ఏలూరు నుండి ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం 6 గంటలకు స్థానిక రెవిన్యూ భవనం నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ దృష్టిని ఆకర్షించేందుకు ఈ సభ ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు.

ఈ రాష్ట్ర మహాసభకు ముఖ్య అతిథులుగా గౌరవ ఆర్థిక శాఖామాత్యులు పయ్యావుల కేశవ్, గౌరవ పౌర సరఫరాల శాఖామాత్యులు నాదెండ్ల మనోహర్, గౌరవ వైద్య ఆరోగ్య శాఖామాత్యులు సత్య కుమార్ యాదవ్ పాల్గొననున్నట్లు తెలిపారు.

ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, 12వ పీఆర్సీ అమలు, మధ్యంతర భృతి మంజూరు వంటి ఆర్థిక, ఆర్థికేతర సమస్యల పరిష్కారం కోసం ఏలూరు జిల్లా నుంచి వేలాదిగా తరలివెళ్లి తమ గళాన్ని వినిపించాలని నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏపీ జేఏసీ అమరావతి జనరల్ సెక్రటరీ బి. రాంబాబు, రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఏ. ప్రమోద్ కుమార్, ఏపీపీటిడిఏ గౌరవ అధ్యక్షులు వై. శ్రీనివాస్ (వైఎస్), పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మహాలక్ష్ముడు, ఏపీ జేఏసీ అమరావతి జిల్లా వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్, ఏలూరు డివిజన్ ప్రెసిడెంట్ కృష్ణస్వామి, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.