జిల్లాలో పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఏలూరు జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యులు కె.ఎస్. శంకర్రావు తెలిపారు. శనివారం కొయ్యలగూడెం ఎంపీడీవో కార్యాలయం మీటింగ్ హాల్లో, కొయ్యలగూడెం మండల ఏపీడబ్ల్యూజేఎఫ్ అనుబంధ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పూలపల్లి కృష్ణబాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా స్థానిక పాత్రికేయులు తమ సమస్యలను శంకర్రావు దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వానికి–ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న పాత్రికేయుల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు మీడియా అక్రిడేషన్‌లు మంజూరయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీడీవో కొమ్మా కిరణ్ కుమార్ మాట్లాడుతూ, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో పాత్రికేయ వృత్తి కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ విషయంలో కొయ్యలగూడెం మీడియా ముందంజలో ఉందని అభినందించారు.
అనంతరం ఎంపీడీవో కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు కె.ఎస్. శంకర్రావును దుశ్శాలువాతో ఘనంగా సత్కరించి, పూల కుండీ అందజేసి జ్ఞాపికను బహూకరించారు.
ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పూలపల్లి కృష్ణబాబు, ఏ.వీ.డి. సీతారామరాజు, ఎం. సాయిబాబా, సిరిబత్తుల సురేష్, షేక్ ఆలీం, మన్నే దుర్గబాబు, జొన్నకూటి మహేష్, ప్రేమ్ కుమార్, జంగారెడ్డిగూడెం ఫెడరేషన్ నాయకులు కలపాల శ్రీనివాస్, గొల్లమండల శ్రీనివాస్, కృష్ణ, బి. ప్రసాద్ వర్మ తదితరులు పాల్గొన్నారు.


.jpeg)














Social Plugin