ఆడమిల్లిలో ఇంటింటికి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

ఆడమిల్లిలో ఇంటింటికి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

లబ్ధిదారుల ఇంటికే వెళ్లి పింఛన్లు అందజేసిన చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్

ఏలూరు జిల్లా, కామవరపుకోట:
కామవరపుకోట మండలం ఆడమిల్లి పంచాయతీలో శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారుల ఇంటికే వెళ్లి చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆడమిల్లి పంచాయతీ సర్పంచ్ గూడపాటి కేశవరావు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ–విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఒక రోజు ముందుగానే ఇంటింటికి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం తెల్లవారుజామునే చింతలపూడి నియోజకవర్గంలో ప్రారంభమైంది.

శనివారం కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఆడమిల్లి గ్రామంలో పింఛన్ల పంపిణీ చేపట్టగా, శాసనసభ్యులతో పాటు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ,
చంద్రన్న మీ ఇంటికి నన్ను పంపారు. మీకు ఒక రోజు ముందుగానే పెన్షన్ అందిస్తున్నాం. ప్రతి ఇంట్లో చిరునవ్వు చూడడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం” అని లబ్ధిదారులతో అన్నారు.

ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెలా ఒకటవ తేదీనే పింఛన్లు అందిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని తెలిపారు. ఈ నెలలో ఒకటవ తేదీ ఆదివారం కావడంతో, అవ్వా–తాతలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక రోజు ముందుగానే 31వ తేదీన పింఛన్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

కూటమి ప్రభుత్వ సంపూర్ణ సహకారంతో చింతలపూడి నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పన, ఇంటింటికి కాలువల ఏర్పాటు, తాగునీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామగ్రామాన అభివృద్ధి పరుగులు తీస్తోందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్, ఆడమిల్లి పంచాయతీ సర్పంచ్ గూడపాటి కేశవరావు, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, మండల పార్టీ అధ్యక్షుడు కిలారి సత్యనారాయణ, గ్రామ టీడీపీ కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.