ఏలూరు జిల్లా ఉంగుటూరు: నియోజకవర్గం నాచుగుంట గ్రామానికి చెందిన కొరపాటి పెద్దలు ఇటీవల జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనను తెలుసుకున్న అఖిలాంధ్ర దివ్యాంగుల సేవా సమితి – మానవసేవే మాధవసేవ టీం సభ్యులు ఈ నెల 14వ తేదీన నాచుగుంట గ్రామానికి వెళ్లి, మృతుని కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారికి ధైర్యం చెప్పడంతో పాటు రోజువారీ అవసరాలకు ఉపయోగపడే నిత్యావసర వస్తువులు అందజేశారు. అదనంగా రూ.5,000/- ఆర్థిక సాయాన్ని అందించి, భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా తమ సేవా సమితి అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో అఖిలాంధ్ర దివ్యాంగుల సేవా సమితి అధ్యక్షులు మామిడిపల్లి నాగభూషణం, గౌరవ అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్, సెక్రటరీ నక్క రాము, సలహాదారు ఊద్దండ అప్పారావు, కార్యదర్శి ఆంజనేయులు పాల్గొన్నారు. అలాగే ఉంగుటూరు మండల అధ్యక్షులు కోరపాటి రాంబాబు, ఉపాధ్యక్షులు యు. దుర్గారావు, ఓం శాంతి, సత్యనారాయణ, నాగేశ్వరరావు, భాషతో పాటు ఇతర టీం సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దివ్యాంగుల సంక్షేమం కోసం ఎప్పుడూ ముందుండే అఖిలాంధ్ర దివ్యాంగుల సేవా సమితి, ఇలాంటి ఆపద వేళల్లోనూ మానవత్వాన్ని చాటుతూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తోందని గ్రామస్థులు ప్రశంసించారు.















Social Plugin