డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట మండలం, పి.గన్నవరం మండలం: రాష్ట్ర ప్రభుత్వం జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపధ్యంలో అన్ని ప్రభుత్వ శాఖల సమిష్టి కృషితో ప్రభల తీర్థం విజయవంతమైందని కోనసీమ ఆహారనిధి అధ్యక్షుడు వీరం శెట్టిసతీష్ అన్నారు. మునుపెన్నడూ లేని విధంగా జగ్గన్నతోట ప్రభల తీర్థానికి సుమారు 4.నుండి 5 లక్షల మంది భక్తులు హాజరయ్యారని వీరందరినీ క్రమ బద్దీకరించేందుకు పోలీస్ యంత్రాoగం మంచి చర్యలు చేపట్టిందని సతీష్ పేర్కొన్నారు.
పోలీసు విభాగంలో జిల్లా ఎస్.పి రాహుల్ మీనా ఆదేశాల మేరకు కొత్తపేట డి.ఎస్.పి.సుంకర మురళీమోహన్ ఆధ్వర్యంలో పి.గన్నవరం సి.ఐ, ఆర్.భీమరాజు నేతృత్వంలో సిబ్బందికి తగిన ఆదేశాలు ఇచ్చి, ముందస్తు ప్రణాళికతో తీసుకున్న చర్యల వల్ల ట్రాఫిక్ క్రమబద్ధీకరణ జరిగిందన్నారు. ప్రభల తీర్థంలో అస్వస్థతకు గురైన రాజమహేంద్రవరంకు చెందిన ఒక భక్తుడు సొమ్మసిల్లి పడిపోగా స్వయంగా సి.ఐ, టెంట్ బల్ల సాయంతో అంబులెన్స్ వద్దకు మోసుకెళ్లారని సతీష్ గుర్తు చేశారు.
ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహిస్తున్న భీమరాజు లాంటి ఆధికారికి ఈ సందర్భంగా కోనసీమ ఆహారనిధి వ్యవస్థాపక అధ్యక్షుడు వీరంశెట్టి సతీష్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దుశాలువ కప్పి, డొక్కా సీతమ్మ కోనసీమ ఆహారనిధి జ్ఞాపిక అందచేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తూ ప్రజలను చైతన్య పరుస్తున్న భీమరాజు గారి లాంటి వారు సమాజానికి చాలా అవసరమని సతీష్ పేర్కొన్నారు.
సంక్రాంతి పండగలో 470 సంవత్సరాల విశిష్టత కలిగిన జగ్గన్న తోట ప్రభల తీర్ధం తొలిసారి రాష్ట్ర పండుగగా ఈ ఏడాది జరుపుకుంది. పి.గన్నవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ రుద్రరాజు భీమరాజు నేతృత్వలో ముందస్తు చర్యలతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ,ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రభల తీర్ధాన్ని శాంతి యుతంగా నిర్వహించడంలో సఫలీకృతులయ్యారు..
సందర్భంగా భీమరాజు మాట్లాడుతూ యువతరానికి ఉపయోగపడే కార్యక్రమాలు రూపొందిస్తే నేనెపుడు ముందు ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పవన్ గంగరాజు తదితరులు పాల్గొన్నారు
%20(1)%20(1)_11zon.png)














Social Plugin