ఎర్రంపల్లి లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం : డిస్ట్రిక్ట్ గవర్నర్ పాపారావు నాయుడు


ఏలూరు జిల్లా చింతలపూడి: మండలం ఎర్రంపల్లి గ్రామంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఎర్రంపల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షులు దేశవత్ వెంకటరావు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య, సంక్షేమ రంగాల్లో లయన్స్ క్లబ్ చేస్తున్న కృషి ప్రశంసార్హమని ఆయన పేర్కొన్నారు.


ఎర్రంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లక్ష రూపాయల వ్యయంతో నిర్మించిన సైకిల్ షెడ్డును లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎన్.వి.వి.ఎస్. పాపారావు నాయుడు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో లయన్స్ క్లబ్ పాత్ర కీలకమని ఆయన అన్నారు.

అనంతరం ఎర్రంపల్లి లయన్స్ క్లబ్‌లో డిస్ట్రిక్ట్ గవర్నర్ అఫీషియల్ విజిట్ సందర్భంగా అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముందు లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులు మెల్విన్ జోన్స్ చిత్రపటానికి పుష్పాలు ఉంచి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వృద్ధులకు సహాయ సామగ్రిని పంపిణీ చేశారు.

ముఖ్య అతిథిగా హాజరైన డిస్ట్రిక్ట్ గవర్నర్ పాపారావు నాయుడు మాట్లాడుతూ, ఎర్రంపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నాలుగు క్లబ్‌లను ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని సూచించారు. కొత్త సభ్యులను లయన్స్ క్లబ్‌లో చేర్చి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎడవల్లి గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థినికి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రూ.30 వేల ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే ఎర్రంపల్లి లయన్స్ క్లబ్‌లో 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సభ్యులకు ప్రత్యేక గుర్తింపు పిన్నులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎర్రంపల్లి లయన్స్ క్లబ్ సెక్రటరీ తుమ్మూరి జయమ్మ, జంగా చెన్నకేశవరెడ్డి, తుమ్మూరు సత్యనారాయణ రెడ్డి, నరసింహారావు, చిల్లపల్లి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.