ఏలూరు జిల్లా,పోలవరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పర్యటన నేపథ్యంలో ఏలూరు జిల్లా యంత్రాంగం అత్యంత పటిష్టమైన, ఆధునిక భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి, సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టారు.
ఈ భద్రతా ఏర్పాట్లను ఏలూరు రేంజ్ ఐజి జి.వి.జి. అశోక్ కుమార్, ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ నేతృత్వంలో సమర్థవంతంగా పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన అన్ని అంశాలను అధికారుల సమన్వయంతో ముందుగానే ప్రణాళికబద్ధంగా అమలు చేశారు.
భద్రతా ఏర్పాట్లలో భాగంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలను ఉపయోగించి సభా ప్రాంగణం, హెలిప్యాడ్, ముఖ్యమంత్రి ప్రయాణ మార్గాలను ఎప్పటికప్పుడు గమనించారు.
ఐజి జి.వి.జి. అశోక్ కుమార్, ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ స్వయంగా క్షేత్రస్థాయిలో ఉండి బందోబస్తును పర్యవేక్షిస్తూ అధికారులకు ఎప్పటికప్పుడు తగిన ఆదేశాలు జారీ చేశారు. జిల్లా లోని వివిధ పోలీస్ స్టేషన్ల నుండి అదనపు బలగాలను రప్పించి, బహుళ అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు.
ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తూ, ప్రత్యామ్నాయ మార్గాలను ముందుగానే సూచించారు. అధికారుల సమర్థవంతమైన పర్యవేక్షణ, పోలీస్ సిబ్బంది అంకితభావంతో కూడిన సేవల వల్ల ముఖ్యమంత్రి పర్యటన ప్రశాంతంగా, సురక్షితంగా కొనసాగింది.
ఈ భద్రతా కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ జయ శర్మ, ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎన్. సూర్య చంద్రరావు, పోలవరం డీఎస్పీ ఎం. వెంకటేశ్వరరావు, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్, నూజివీడు డీఎస్పీ ప్రసాద్, డీటీసీ డీఎస్పీ ప్రసాద్, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు మరియు పెద్ద సంఖ్యలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టు పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు https://t.co/dpEWuoO0VE
— ELURU NEWS (@EluruNews90170) January 7, 2026
















Social Plugin