పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రజలను విశేషంగా ఆకర్షించిన ప్రభుత్వ శాఖల ప్రదర్శనలు
ఏలూరు | జనవరి 26:
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టరేట్ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన వివిధ శాఖల అభివృద్ధి స్టాల్స్ ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అద్దం పట్టే విధంగా ఈ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు.
ఈ స్టాల్స్‌లో
-
రైతు సాధికారిక సంస్థ (FPOలు)
-
వ్యవసాయ శాఖ
-
ఉద్యానవన శాఖ
-
అటవీ శాఖ
-
సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటిడిఏ – కె.ఆర్.పురం)
-
జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ)
-
మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ (ఐసిడిఎస్)
-
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)
-
రెవెన్యూ శాఖ – ల్యాండ్ రికార్డ్స్ & పట్టాదార్ పాస్‌బుక్ సేవలు
-
పౌర సరఫరాల శాఖ & పౌర సరఫరాల సంస్థ
-
పశుసంవర్ధక శాఖ
తమ తమ శాఖల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలు, పథకాలపై వివరాలను ప్రదర్శించాయి.
ఉత్తమ స్టాల్స్‌కు బహుమతులు
స్టాల్స్‌ను పరిశీలించిన అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన శాఖలకు బహుమతులు అందజేశారు.
-
ప్రథమ బహుమతి: ఉద్యానవన శాఖ
-
ద్వితీయ బహుమతి: మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ (ఐసిడిఎస్)
-
తృతీయ బహుమతి: జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ)
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కె. ప్రతాప్ శివకిషోర్ సంబంధిత శాఖల అధికారులకు బహుమతులను అందజేసి అభినందించారు. స్టాల్స్‌ను పరిశీలిస్తూ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు జుత్తిగ నాగరాజు, జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, అదనపు ఎస్పీ నక్కా సూర్య చంద్రరావు, జిల్లా రెవెన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, ఆర్డీఓ ఎం. అచ్యుత్ అంబరీష్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.















Social Plugin