జిల్లా అభివృద్ధికి అందరూ పునరంకితమవ్వాలి: జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి


 

ఏలూరు జిల్లాలో అంబరాన్నంటిన 77వ గణతంత్ర దినోత్సవ సంబరాలు

ఏలూరు | జనవరి 26:
జిల్లాను అన్ని రంగాల్లో ప్రగతిపథంలో ఉంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో పునరంకితమవ్వాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పిలుపునిచ్చారు.

స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో సోమవారం నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రసంగించారు.

స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల స్మరణ

దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని కలెక్టర్ తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటికీ సమాన ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని పేర్కొన్నారు.

స్వర్ణాంధ్ర @2047 – ప్రణాళికాబద్ధ అమలు

స్వర్ణాంధ్ర @2047 విజన్ లక్ష్యంగా జిల్లా యంత్రాంగం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోందన్నారు. పీ4 కార్యక్రమం ద్వారా జిల్లాలోని 71,876 బంగారు కుటుంబాల జీవన ప్రమాణాల మెరుగుదలకు 5,519 మార్గదర్శకులను గుర్తించినట్లు తెలిపారు.

వ్యవసాయం – రైతు సంక్షేమం

  • 1,60,968 రైతులకు రూ. 213.31 కోట్లు (పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ)

  • 52 కిసాన్ డ్రోన్లు, రూ. 4.8 లక్షల విలువైన యంత్రాలు915 రైతులకు, రూ. 2.89 కోట్ల సబ్సిడీ

  • ఖరీఫ్ సీజన్‌లో 4.15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు – రూ. 920 కోట్లు 24 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ

మౌలిక వసతులు – నీటిపారుదల

  • తమ్మిలేరుపై బలివే గ్రామం వద్ద రూ. 18.30 కోట్లతో చెక్‌డ్యాం–కమ్ డబుల్ లైన్ బ్రిడ్జి

  • పోలవరం ప్రాజెక్ట్ కుడి ప్రధాన కాలువ పనులు 92.79% పూర్తి

  • పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 446 టీఎంసీల గోదావరి జలాలు కృష్ణా నదికి మళ్లింపు

ఇళ్ల నిర్మాణం – భూసమస్యల పరిష్కారం

  • 83,233 పేద కుటుంబాలకు రూ. 1,516 కోట్లతో గృహాలు – 45,737 పూర్తీ

  • మెగా 22-A భూ సమస్యల పరిష్కార వేదిక ద్వారా 1,399 కేసులు పరిష్కారం, 219.56 ఎకరాలు 22-A జాబితా నుంచి తొలగింపు

  • మీ భూమి–మీ హక్కు పథకం కింద 77,500 రైతులకు క్యూఆర్ కోడ్‌తో పట్టాదార్ పాస్ పుస్తకాలు

విద్య – ఆరోగ్యం – ఉపాధి

  • డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా 1,04,203 విద్యార్థులకు పౌష్టికాహారం

  • వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ & ఆజీవికా మిషన్ ద్వారా 92.14 లక్షల పనిదినాలు, రూ. 258.25 కోట్లు వేతనాలు

  • 2,59,151 మందికి రూ. 113.68 కోట్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు

  • 57 జాబ్ మేళాలు4,182 మందికి ఉద్యోగాలు

సోలార్ – పరిశ్రమలు – అవార్డులు

  • ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనలో 6,503 వినియోగదారులు, 19 మెగావాట్లు – రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానం

  • గిరిజన గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం నుంచి “థర్టీ అబవ్ జనాభాగీదారి అభియాన్” అవార్డు

  • వైజాగ్ పార్టనర్షిప్ సమ్మిట్ ద్వారా రూ. 679.39 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమల కోసం ఎంఓయూలు

భద్రత – పోలీస్ పనితీరు

మావోయిస్టుల కదలికలపై గట్టి నిఘా ఉంచి 15 మందిని అరెస్ట్ చేసినట్లు, డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న సైబర్ నేరాలపై అంతర్జాతీయ నేరస్తులను పట్టుకోవడంతో ఏలూరు జిల్లా పోలీసులకు జాతీయ గుర్తింపు వచ్చిందన్నారు.

పాల్గొన్న ప్రముఖులు

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్, జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ, డీఆర్వో వి. విశ్వేశ్వరరావు, జెడ్పీ సీఈఓ కె. సుబ్బారావు, ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.







.......................