దెందులూరు, జనవరి 23: ఏలూరు జిల్లా దుగ్గిరాలలోని దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఆత్మీయ భేటీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, రాష్ట్ర సమాచార–గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ కొలుసు పార్ధసారధి గారు, ఏలూరు ఎంపీ శ్రీ పుట్టా మహేష్ గారు, టీడీపీ జోన్–2 కన్వీనర్ శ్రీ మందలపు రవి గారు, మాజీ ఎమ్మెల్యే శ్రీ ఘంటా మురళీ గారు పాల్గొన్నారు.
క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులకు దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు నియోజకవర్గ కూటమి నాయకులతో కలిసి ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన తేనీటి విందు కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు పలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి అంశాలపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో దెందులూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీమతి గారపాటి రామసీత, ఏలూరు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు బొప్పన సుధ, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉప్పలపాటి రాంప్రసాద్, సెక్రటరీ దేవరపల్లి ఆదాం, మండల పార్టీ అధ్యక్షులు ఈడుపుగంటి అనిల్, నంబూరు నాగరాజు, మరడాని రవి, తెలుగు యువత అధ్యక్షులు మోతుకూరి నాని, తిలక్‌తో పాటు పలువురు క్లస్టర్ ఇంచార్జీలు, సొసైటీ చైర్మన్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు.















Social Plugin