ఏలూరులో సమాచార శాఖ సిబ్బందికి జిల్లా కలెక్టర్ ప్రశంసలు


 

ఏలూరులో సమాచార శాఖ సిబ్బందికి జిల్లా కలెక్టర్ ప్రశంసలు

ఏలూరు | జనవరి 26:
విధుల నిర్వహణలో ఉత్తమ సేవలందించిన సమాచార, పౌర సంబంధాల శాఖ సిబ్బందికి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ప్రశంసా పత్రాలు అందజేశారు.

77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సోమవారం స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన కార్యక్రమంలో, జిల్లా సమాచార–పౌర సంబంధాల శాఖ ఏలూరు కార్యాలయంలో పని చేస్తున్న సిబ్బందిని వారి సేవలకు గాను సత్కరించారు.

ప్రశంసా పత్రాలు అందుకున్న వారు

  • సిహెచ్. కనకదుర్గ ప్రసాద్ – డివిజినల్ పౌర సంబంధాధికారి

  • ఎస్. గంగాధర్ – టెక్నికల్ సబార్డినేట్

  • పి. సాగర్ – ఫోటోగ్రాఫర్

ఈ ముగ్గురికి జిల్లా కలెక్టర్ స్వయంగా ప్రశంసా పత్రాలు అందజేశారు.

అలాగే, జిల్లా సమాచార–పౌర సంబంధాల శాఖలో ఉప కార్యనిర్వాహక సమాచార ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్న యూ. సురేంద్రాధ్ రాష్ట్ర స్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్ల విధులకు హాజరుకావడంతో, ఆయనకు కేటాయించిన ప్రశంసా పత్రాన్ని శాఖ సిబ్బంది అందుకున్నారు.

ఈ సందర్భంగా యూ. సురేంద్రాధ్, సిహెచ్. కనకదుర్గ ప్రసాద్, ఎస్. గంగాధర్, పి. సాగర్ లను కార్యాలయ సిబ్బంది అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.