రెడ్డి అప్పలనాయుడు నివాసం వద్ద ఘనంగా నూతన సంవత్సర వేడుకలు


ఏలూరు జిల్లా, ఏలూరు: 2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పలనాయుడు నివాసం వద్ద గురువారం ఉదయం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచే వివిధ వర్గాల ప్రజలు, రాజకీయ నాయకులు, అధికారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.


ఆర్టీసీ ఉన్నతాధికారులు, పలు సంఘాల నాయకులు, మార్కెట్ యార్డ్ యూనియన్ ప్రతినిధులు, పార్టీలకు అతీతంగా ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రెడ్డి అప్పలనాయుడుని మర్యాదపూర్వకంగా కలిసి భారీ గజమాలలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. చెంచుల కాలనీలోని ఆయన నివాసం వద్ద పండుగ వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ 2026 నూతన సంవత్సరం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ఏలూరు నియోజకవర్గ ప్రజలకు, జనసేన పార్టీతో పాటు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

అలాగే జనసేన పార్టీని క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్న పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ కి, పార్టీ రాష్ట్ర కార్యవర్గానికి, జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు కి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు, రైతులు, కార్మికులు, శ్రామికులు, వ్యాపారులు, ఉద్యోగులు, ఎన్జీవోలు సహా ప్రతి ఒక్కరూ 2026 సంవత్సరంలో ఆనందంగా, సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు.

డబుల్ ఇంజిన్ ఎన్డీఏ ప్రభుత్వంతో రాష్ట్రంలో ఉద్యోగ కల్పన, మౌలిక వసతులు, పరిశ్రమలు సహా అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలని, రాష్ట్ర సంపద ప్రజలందరికీ సమానంగా అందేలా మంచి పాలన కొనసాగాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, మెగా అభిమానులు, వివిధ సంఘాలు, యూనియన్ల నాయకులు, ఏపీఎస్ఆర్టీసీ అధికారులు, కార్పొరేటర్లు, కూటమి పార్టీల నేతలు, పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.