ఏలూరు జిల్లా, ఏలూరు: మహిళా విద్యకు బాటలు వేసి, సామాజిక సమానత్వం కోసం నిరంతరం పోరాడిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు మాతా సావిత్రి భాయ్ పూలే గారి జయంతి సందర్భంగా జిల్లా పరిషత్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన ఆమె విగ్రహానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శ్రీమతి ఘంటా పద్మశ్రీ ప్రసాద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా శ్రీమతి ఘంటా పద్మశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ, సావిత్రి భాయ్ పూలే మహిళల విద్య, సమాన హక్కులు, సామాజిక న్యాయం కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. మహిళా విద్యాభివృద్ధికి ఆమె చేసిన కృషి నేటి తరానికి ఆదర్శమని, సమానత్వ భావనను సమాజంలో బలంగా నాటిన మహనీయురాలిగా ఆమె చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రిటైర్డ్ జిల్లా రిజిస్ట్రార్, బీసీ జేఏసీ నాయకులు లంక వెంకటేశ్వరావు, రాష్ట్ర బీసీ–ఓబీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు విఠల్ కుమార్, జిల్లా బీసీ–ఓబీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు పామర్తి యేసురాజు, బీసీ నాయకులు గోపాలకృష్ణ పాల్గొన్నారు. అలాగే జిల్లా పరిషత్ కార్యాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరై సావిత్రి భాయ్ పూలే కి నివాళులు అర్పించారు.















Social Plugin