ఏలూరు జిల్లా, ముసునూరు: ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, నూజి వీడు డిఎస్పీ కె.వి.వి. ఎన్.వి. ప్రసాద్ ఆదేశాలపై రానున్న సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కోడిపందాలు, పేకాట, గుండాట వంటి జూదా క్రీడలు జరగకుండా ముసునూరు పోలీస్ విస్తృత చర్యలు చేపట్టారు.
ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామంలో కోడి పందాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన బారులను నూజివీడు రూరల్ ఇన్‌స్పెక్టర్ కె. రామ కృష్ణ ఆధ్వర్యంలో ముసునూరు ఎస్‌ఐ చిరంజీవి తమ సిబ్బందితో కలిసి
ట్రాక్టర్ల సహాయంతో బారులు పూర్తిగా ధ్వంసం చేశారు. సదరు ప్రాంతాలలో హెచ్చరికల బ్యానర్లు ఏర్పాటు చేసి, కోడి పందాలు, పేకాట, గుండాట వల్ల కలిగే ఆర్థిక, సామాజిక, కుటుంబ అనర్థాల పై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ముసునూరు ఎస్‌ఐ చిరంజీవి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ పేరుతో ఎవరైనా కోడిపందాలు లేదా ఇతర జూదా క్రీడలు నిర్వహించినా లేదా వాటిలో పాల్గొన్నా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసు కుంటామని హెచ్చరించారు.
అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఉంటే డయల్ 112 కు గానీ లేదా సమీప పోలీస్ స్టేషన్ కు గానీ తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని పోలీసులు భరోసా ఇచ్చారు.















Social Plugin