ఏలూరు జిల్లా, ద్వారకాతిరుమల: మండలం రామన్నగూడెం గ్రామపంచాయతీకి చెందిన కూచంపూడి నాగు ప్రమాదవశాత్తు ఇటీవల మృతి చెందారు, వారికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఇన్సూరెన్స్ సొమ్ము, 5లక్షల రూపాయలు మంజూరు అయినవి, ఈ సొమ్ము వారి బ్యాంకు ఖాతాలో జమైనది, దానికి సంబంధించిన మంజూరు పత్రాలను, గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు వారి కుటుంబ సభ్యులకు ద్వారకాతిరుమలలో అందజేశారు.
తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కార్యకర్తలకు అండగా ఉంటుందని, వారి కుటుంబానికి అండగా నిలిచిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు , యువ నాయకులు నారా లోకేష్, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు,
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్, ద్వారకాతిరుమల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లంకా సత్యనారాయణ, ద్వారక తిరుమల సొసైటీ చైర్మన్ పోలిన శ్రీనివాసరావు, రామన్న గూడెం సొసైటీ చైర్మన్ బొబ్బ రాము, జడ్పీటీసీ శ్యామ్యులు, రాజమండ్రి పార్లమెంట్ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీపీ యేపూరి దాలయ్య, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మట్టపర్తి రూపేష్ కుమార్, మండల తెలుగు రైతు అధ్యక్షులు పాకలపాటి మాణిక్యాల రావు, మండల ఐ టి డి పి అధ్యక్షులు ఏపూరికిషోర్, గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి పెండ్లి విజయ్, గుణ్ణం రవి, తిమ్మాపురం ఎంపీటీసీ సభ్యులు శ్రీమతి కొయ్యలమూడి వెంకట సరిత, బోట్ల సాయి తదితరులు పాల్గొన్నారు.















Social Plugin