ఏలూరు జిల్లా, చింతలపూడి: ఏలూరు జిల్లా చింతలపూడి మండలం మల్లేశ్వరం గ్రామంలో ఎంజీ ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో రూ.7.50 లక్షల వ్యయంతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ ప్రారంభించారు.
అంగన్వాడీ భవనం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు మల్లేశ్వరం గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని ఘన స్వాగతం పలికారు. అనంతరం నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ఎమ్మెల్యే రోషన్ కుమార్ అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎన్నికల ప్రచార సమయంలో ఈ గ్రామానికి వచ్చినప్పుడు గ్రామస్తులు అందించిన ఆదరణను గుర్తు చేసుకున్నారు. ఇప్పటికీ అదే ప్రేమాభిమానాలను కూటమి ప్రభుత్వంపై, తనపై చూపిస్తున్నందుకు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే ఆదరణ కొనసాగాలని ఆకాంక్షించారు.
అలాగే కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే బాధ్యత గ్రామ నాయకులు, కార్యకర్తలపై ఉందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రతి ఇంటికి చేరేలా తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.















Social Plugin