ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ వేదికగా నిలుస్తోంది
— కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు
డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రావులపాలెం / కొత్తపేట, జనవరి 23: ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయడమే లక్ష్యంగా ప్రజా దర్బార్ కార్యక్రమం పనిచేస్తోందని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు అన్నారు.
రావులపాలెంలో శుక్రవారం ఆయన నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు.
ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పన, రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం అధిక సంఖ్యలో వినతులు అందినట్లు ఆయన తెలిపారు. ప్రజా దర్బార్ ద్వారా వారానికి ఒకసారి నేరుగా ప్రజలను కలుసుకుని వారి సమస్యలను వినడం, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుందన్నారు.
ప్రజల నుంచి అందిన వినతులను సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తూ, సమస్యలను వేగంగా పరిష్కరించేలా సూచనలు ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం జరిగిందన్నారు.
ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో మొత్తం 206 వినతులు అందాయని అధికారులు తెలిపారు.















Social Plugin