ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షునిగా బడేటి చంటి పదవీ స్వీకరణ – ఘనంగా వేడుకలు


ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షునిగా బడేటి చంటి పదవీ స్వీకరణ – ఘనంగా వేడుకలు
ఉంగుటూరు నియోజకవర్గ టీడీపీ శ్రేణుల భారీ హాజరు


ఏలూరు జిల్లా, ఏలూరు: ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ఈరోజు అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పదవీ స్వీకరణ మహోత్సవ వేడుకకు ఉంగుటూరు నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు హాజరై అభినందనలు తెలిపారు. ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు నియోజకవర్గ టీడీపీ సైన్యంతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి, ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్, దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్, చింతలపూడి శాసనసభ్యులు  సొంగా రోషన్ కుమార్, గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకట్రాజు, ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ పాల్గొన్నారు.

అలాగే జోన్–2 కోఆర్డినేటర్ మందలపు రవి, మాజీ మంత్రి వర్యులు శ్రీమతి పీతల సుజాత, ఏలూరు నగర మేయర్ శ్రీమతి నూర్జహాన్, పోలవరం టీడీపీ ఇంచార్జ్ బొరగం శ్రీనివాసు, జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, జిల్లా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకను ఘనంగా నిర్వహించారు.

పదవీ స్వీకరణకు ముందు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా కమిటీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా సభ్యులచేత ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ప్రమాణం చేయించారు.

ఈ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను కూడా ఘనంగా నిర్వహించి, పార్టీ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు.













-----------------------------------------------------------------------------------------------------------------------------