ఫిబ్రవరి 12 సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి


ఫిబ్రవరి 12 సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి
ఏలూరు మార్కెట్ యార్డ్ హమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో IFTU డైరీ ఆవిష్కరణ


ఏలూరు జిల్లా, ఏలూరు: ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ, 24 తేదీన IFTU అనుబంధ ఏలూరు మార్కెట్ యార్డ్ హమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 2026 సంవత్సరానికి సంబంధించి IFTU రాష్ట్ర కమిటీ ముద్రించిన నూతన డైరీని ఘనంగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డి అప్పలనాయుడు, సహాయ కార్యదర్శి యర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ, IFTU రాష్ట్ర కమిటీ ప్రచురించిన ఈ నూతన డైరీలో కార్మిక వర్గ కార్యక్రమాలు, ఉద్యమాలు, హక్కుల పరిరక్షణకు సంబంధించిన అనేక అంశాలను పొందుపరిచినట్లు తెలిపారు. కార్మిక వర్గానికి అవగాహన కల్పించే దిశగా ఈ డైరీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

అలాగే ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం, హమాలీ వర్గం, కష్టజీవులందరూ పెద్ద ఎత్తున పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికులను కట్టు బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం జరుగుతున్న ఈ సమ్మెను విజయవంతం చేయాల్సిన బాధ్యత కార్మిక వర్గం మీదే ఉందని స్పష్టం చేశారు.

ఈ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో మీసాల వెంకటరమణ, ధనాన్ విజయ్, కోరడ అప్పారావు, మజీ శ్రీను, సూరిబాబు, శివ, మంగరాజు రాము, పల్లి గంగరాజు, వెంకటేశ్వరరావు, చల్లా శ్రీను, దుర్గారావు, నాకిరెడ్డి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.