నూజివీడులో ఘనంగా నారా లోకేష్ జన్మదిన సేవా కార్యక్రమాలు


నూజివీడులో ఘనంగా నారా లోకేష్ జన్మదిన సేవా కార్యక్రమాలు
మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో విస్తృత కార్యక్రమాలు


ఏలూరు జిల్లా, నూజివీడు: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖల మంత్రివర్యులు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా నూజివీడు నియోజకవర్గంలో భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలను రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రివర్యులు కొలుసు పార్థసారథి ఆధ్వర్యంగా చేపట్టారు.

ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ, కూటమి ప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో శరవేగంగా నడిపిస్తున్న యువనేత నారా లోకేష్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేస్తున్న సేవలు మరింత విస్తరించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రిలో జన్మించిన పలు శిశువులకు ఉయ్యాలలు, దుస్తులు, హిమాలయ బేబీ కిట్లు అందజేయడంతో పాటు, బాలింతలకు చీరలను మంత్రి అందజేశారు.

ప్రతి ఒక్కరికి సుమారు రూ.5,000 విలువైన వస్తువులను మంత్రి కొలుసు పార్థసారథి గారు స్వంత ఖర్చుతో అందించడం విశేషంగా నిలిచింది. లోకేష్ పుట్టినరోజున జన్మించిన పిల్లలు భవిష్యత్తులో ఆయన ఆశీర్వాదాలతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తూ ఈ కానుకలను అందజేశారు.

అదేవిధంగా నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు, తుక్కులూరు గ్రామంలోని జేబీఎల్ వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కూటమి నాయకుల ఆధ్వర్యంలో సుమారు 30 మంది బాలింతలకు ఈ సహాయం అందజేయబడింది.

పలు కార్యకమలు ఫోటోలు..



























-----------------------------------------------------------------------------------------------------------------------------