విద్యార్థి ,యువతకిచ్చిన హామీలను అమలుపరచమంటే రౌడీషీటర్లో ఓపెన్ చేస్తారా...
ఏలూరు జిల్లా, ఏలూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా సమస్యలపై ప్రశ్నిస్తున్న విద్యార్థి, యువజన సంఘాల నాయకులపై అక్రమ కేసులు బనాయించడాన్ని, రౌడీషీట్లు ఓపెన్ చేయడాన్ని యువజన,విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ (AIYF,AISF,PDSU YSRSU,PYL, ) ఆధ్వర్యంలో ఫైర్ స్టేషన్ సెంటర్ నందు నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది.
ఈ సందర్భంగా AISF రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయికుమార్, ఏఐఎస్ఎఫ్, ఏలూరు జిల్లా అధ్యక్షులు డి.శివకుమార్ ఏఐవైఎఫ్ ఏలూరు జిల్లా కన్వీనర్ తొర్లపాటి రాజు, పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు కాకి నాని, పి వై ఎల్ అధ్యక్షుడు బాబురావు, YSRSU జిల్లా అధ్యక్షులు రాజేష్, YSRYOUTH ఏలూరు నియోజకవర్గం అధ్యక్షులు గంట సాయి శివ ప్రదీప్ మాట్లాడుతూ.. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా మూతబడ్డ నాలుగు వేల పాఠశాలను పున ప్రారంభిస్తాము, అదేవిధంగా మండలానికి ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, కళాశాల ను ఏర్పాటు చేసాము, జిల్లాకొక విశ్వవిద్యాలయాన్ని నిర్మించు ఖాళీగా ఉన్నప్పుడు చేస్తామని హామీ ఇచ్చారు.
మరి ముఖ్యంగా గత ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీట్లను అంగట్లో సర్కులాగా అమ్ముకుంటుంది మన ప్రభుత్వం. ఆ 17 మెడికల్ కళాశాలలను ప్రభుత్వ రంగంలోని కొనసాగిస్తాము మాట ఇచ్చారు. నిరుద్యోగులకి ప్రతినెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని మరియు ప్రతి జనవరి ఫస్ట్ తారీఖున జాబ్ క్యాలెండర్ విడుదల చేసి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తాము, నిరుద్యోగులకు నిరుద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు కానీ మాటలకే పరిమితం అయ్యే కానీ అమలుపరచడంలో ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందన్నారు.
హామీల అమలు అడిగితే కేసులు పెట్టి జైల్లో పెట్టడం కరెక్టా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు, విద్యార్థులకు ఇచ్చిన ‘మెగా డీఎస్సీ’, ‘ఉద్యోగ క్యాలెండర్’, ‘ఫీజు రీయింబర్స్‌మెంట్’ వంటి హామీలను అమలు చేయాలని కోరడం నేరమా అని ప్రశ్నించారు. సొంత ఆస్తులు అడగడం లేదని, కేవలం ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోమంటే అక్రమంగా జైలుకు పంపడం దుర్మార్గమన్నారు.
విశాఖపట్నంలో విద్యార్థి నాయకులపై పెట్టిన అక్రమ రౌడీషీట్లను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటూ, వారిని నేరస్తులుగా చిత్రీకరించే ప్రయత్నాన్ని మానుకోవాలని హెచ్చరించారు.
నారా లోకేష్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు "మా ప్రభుత్వం వస్తే యువజన విద్యార్థి సంఘాల నాయకులపై కేసులు ఉండవు, మీ సమస్యలు నేరుగా నా దృష్టికి తీసుకురండి" అని చెప్పిన లోకేష్.. నేడు అధికారంలోకి రాగానే ‘రెడ్ బుక్’ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారని మండిపడ్డారు.
అణచివేతతో ఉద్యమాలను ఆపలేరు:
పోలీసుల లాఠీలు, అక్రమ కేసులు, గృహ నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని, ఇది ప్రజాస్వామ్య దేశమే కానీ నియంతృత్వ రాజ్యము కాదని గుర్తు చేశారు. విశాఖపట్నంలో విద్యార్థి నాయకులపై పెట్టిన రౌడీషీట్లను వెంటనే తొలగించాలి. రాష్ట్రవ్యాప్తంగా నిరసనకారులపై పెట్టిన అక్రమ కేసులను వెనక్కి తీసుకోవాలి. ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్, నాయకుల సిద్దు, కృష్ణ, గోపి, ఏఐవైఎఫ్, నాయకులు వరప్రసాద్, పిడిఎస్ యు నాయకులు, యశ్వంత్, రాజు, గోపి, అనిల్, సునీల్,ఆకాష్, జయ ప్రకాష్, YSRCP విద్యార్థి విభాగం నాయకులు రాజేష్, ప్రదీప్ నాయకులు పాల్గొన్నారు.
ప్రశ్నిస్తే రౌడీషీట్లా? రాష్ట్రంలో ప్రజా పరిపాలన సాగుతోందా లేక ‘రెడ్ బుక్’ రాజ్యాంగమా? https://t.co/AoaP895obI
— ELURU NEWS (@EluruNews90170) January 9, 2026















Social Plugin