ఏలూరు జిల్లా, చింతలపూడి: జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత ఆదేశాల మేరకు చింతలపూడి మండలంలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా ది. చింతలపూడి ఎస్ఐ సతీష్ కుమార్ కి అందిన పక్కా సమాచారంతో, వారి సిబ్బందితో కలిసి యర్రంపల్లె అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్న శిబిరంపై మెరుపు దాడి నిర్వహించారు.
ఈ దాడిలో పేకాట ఆడుతున్న 09 మంది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి మొత్తం రూ.7,160 నగదును స్వాధీనం చేసుకుని, వారిపై చట్టప్రకారం కేసులు నమోదు చేసినట్లు చింతలపూడి ఎస్ఐ సతీష్ కుమార్ తెలిపారు. ఈ దాడులు చింతలపూడి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో జరిగాయి.
ఈ సందర్భంగా ఎస్ఐ సతీష్ కుమార్ మాట్లాడుతూ, చింతలపూడి మండల పరిధిలో పేకాట, కోడి పందాలు లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే, వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.
మారుమూల ప్రాంతాల్లో జరిగే అక్రమ కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించేందుకు ఇకపై డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షణ పెంచుతూ నిఘా కొనసాగిస్తామని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘాతో పాటు ఆకస్మిక దాడులు కూడా కొనసాగుతాయని వెల్లడించారు.
అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనలో ప్రజల సహకారం ఎంతో కీలకమని పేర్కొన్న ఎస్ఐ, ఎవరైనా అక్రమ కార్యకలాపాల గురించి సమాచారం తెలిసిన వెంటనే డయల్ 112కు గానీ, లేదా నేరుగా చింతలపూడి ఎస్ఐ ఫోన్ నెంబర్ 9440796675కు గానీ తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.
అసాంఘిక కార్యకలాపాలు సమాజ శాంతి భద్రతలకు తీవ్ర భంగం కలిగిస్తాయని, వాటి నిర్మూలనకు పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుందని ఈ సందర్భంగా చింతలపూడి ఎస్ఐ సతీష్ కుమార్ స్పష్టం చేశారు.
యర్రంపల్లె అటవీ ప్రాంతంలో పేకాట శిబిరంపై మెరుపు దాడి – 9 మంది అరెస్ట్, రూ.7,160 స్వాధీనం https://t.co/XWPADKPgce
— ELURU NEWS (@EluruNews90170) January 9, 2026















Social Plugin