దెందులూరులో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు


దెందులూరులో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో విస్తృత కార్యక్రమాలు


ఏలూరు జిల్లా, ఏలూరు/దెందులూరు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యా–ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో ఉన్న స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి గజమాల వేసి ఘన నివాళులు అర్పించారు.

అనంతరం కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలతో కలిసి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించి, యువ నాయకులు, మంత్రి నారా లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఏలూరులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుమారు 470 మంది రోగులకు, వారి సహాయకులకు పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వయంగా పాల్గొని రోగులకు పండ్లు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ, క్రమశిక్షణ, కార్యదక్షత కలిగిన యువ నాయకుడిగా నారా లోకేష్ యువతకు స్పూర్తిగా నిలుస్తున్నారని అన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమానికి అండగా నిలుస్తూ, విద్యాశాఖలో వినూత్న మార్పులకు శ్రీకారం చుడుతూ, ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నారని పేర్కొన్నారు. ఐటీ రంగ అభివృద్ధిలో కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేలా ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. అటువంటి సమర్థవంతమైన నాయకుడు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

దెందులూరు నియోజకవర్గ పరిశీలకులు చెన్నుపాటి గాంధీ మాట్లాడుతూ, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నాయకత్వంలో నిర్వహించిన నారా లోకేష్ జన్మదిన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు భారీగా, ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న యువ నాయకులు, మంత్రి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన వెంటే తామంతా నడుస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో దెందులూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారపాటి రామసీత, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు బొప్పన సుధా, జిల్లా పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉప్పలపాటి రామ్ ప్రసాద్, సెక్రటరీ దేవరపల్లి ఆదాం, అధికార ప్రతినిధి రేవతి, మండల పార్టీ అధ్యక్షులు ఈడ్పుగంటి అనిల్, మరడాని రవి, నంబూరి నాగరాజు, కొల్లేరు సంఘం అధ్యక్షులు సైదు సత్యనారాయణ, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు మోరు శ్రావణి, రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ లావేటి శ్రీనివాస్, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ పెనుబోయిన మహేష్ యాదవ్, పెదవేగి సొసైటీ చైర్మన్ తాతా సత్యనారాయణ, తెలుగు యువత అధ్యక్షులు మోతుకూరీ నాని, మొండూరు సొసైటీ చైర్మన్ కొనకళ్ళ శివమణి గౌడ్, చాటపర్రు సొసైటీ చైర్మన్ కాలారీ శ్రీనాథ్ సహా పలువురు ప్రజాప్రతినిధులు, క్లస్టర్ ఇంచార్జ్‌లు, సొసైటీల చైర్మన్‌లు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.