ఏలూరు జిల్లా చింతలపూడి: మండలం చింతలపూడి నగర పంచాయతీలో అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు మూడు రోజుల పాటు సంక్రాంతి యువజన ఉత్సవాలు ఘనంగా నిర్వహించారని ఏఐవైఎఫ్ జిల్లా కో-కన్వీనర్ తొర్లపాటి రాజు తెలిపారు.
ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు 14వ తేదీన నిర్వహించిన క్రికెట్ పోటీలను చింతలపూడి సొసైటీ చైర్పర్సన్ తిరువీధుల రామారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ ఏఎంసీ చైర్మన్ బొడ్డు వెంకటేశ్వరరావు, ఏఐవైఎఫ్ మాజీ నాయకులు, ప్రస్తుత టీడీపీ నాయకులు పల్లె పరదేశి, టీడీపీ పట్టణ కార్యదర్శి కర్లపూడి రాజరత్నం, సీపీఎం జిల్లా నాయకులు ఆర్.వి. సత్యనారాయణ, సీపీఐ మండల కార్యదర్శి తొర్లపాటి బాబు, వైఎస్ఆర్టియు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ముల్లగిరి ఇమ్మానియేలు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కంచర్ల గురవయ్య, సీపీఐ మండల సహాయ కార్యదర్శి దంతా కృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు శానంపూడి కాంతారావు, నక్క వెంకటేశ్వరరావు, పీఈటీ పిట్ట వేణు, టీడీపీ నాయకులు గన్నమనేని వాసు తదితరులు పాల్గొన్నారు.
మొదటి రోజు జరిగిన క్రికెట్ పోటీలలో చిట్టి మాల రామారావు జట్టు విజేతగా నిలవగా, తొర్లపాటి కుమార్ జట్టు రన్నర్‌గా నిలిచింది. రెండో రోజు నిర్వహించిన కబాడీ పోటీలలో ఎస్‌ఎస్ టీం మొదటి బహుమతి గెలుచుకోగా, దేవ టీం రెండో బహుమతి సాధించింది.
మూడో రోజు ముగ్గుల పోటీలు నిర్వహించగా 23 మహిళా జట్లు పాల్గొన్నారు. జనరల్ ముగ్గులు, సంక్రాంతి ముగ్గుల విభాగాల్లో మొదటి, రెండో బహుమతులు అందజేశారు. అనంతరం హైస్కూల్ స్థాయిలో రన్నింగ్ పోటీలు, గ్రామ మహిళల కోసం మ్యూజికల్ చైర్ పోటీలు నిర్వహించి ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు.
బహుమతుల ప్రదానోత్సవ సభకు సీపీఐ మండల కార్యదర్శి తొర్లపాటి బాబు అధ్యక్షత వహించగా, సీపీఐ జిల్లా కార్యదర్శి మనవ కృష్ణ చైతన్య, జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, జిల్లా మహిళా సమైక్య (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ) జిల్లా కార్యదర్శి మన్నవ యామిని, చింతలపూడి పీఏసీఎస్ చైర్పర్సన్ తిరుమిల్లి రామారావు, టీడీపీ పట్టణ కార్యదర్శి కర్లపూడి రాజరత్నం, వైఎస్ఆర్టియు నాయకులు ముల్లగిరి ఇమ్మానియేలు, నగర పంచాయతీ లీగల్ అడ్వైజర్ మన్యం సత్తిబాబు, ఏఐఎస్‌ఎఫ్ మాజీ జిల్లా కార్యదర్శి ముల్లగిరి జీవరత్నం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కంచర్ల గురవయ్య, వింకా హాస్పిటల్ డాక్టర్ దుర్గాప్రసాద్, డాక్టర్ అచ్యుత, మహాత్మ జ్యోతిరావు పూలే అవార్డు గ్రహీత కంభం సుజాత, మహిళా సమైక్య మండల అధ్యక్షురాలు ఎస్‌కే లాల్‌బీ, ఏఐవైఎఫ్ జిల్లా కో-కన్వీనర్ తొర్లపాటి రాజు, సీపీఐ శాఖ కార్యదర్శి ముల్లగిరి నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
వక్తలు మాట్లాడుతూ సంక్రాంతి సమయంలో సంప్రదాయం పేరుతో యువత తప్పుదారి పట్టకుండా, గ్రామీణ క్రీడల ద్వారా క్రీడా స్ఫూర్తిని వెలికితీయడంలో ఏఐవైఎఫ్ నిర్వహిస్తున్న యువజన ఉత్సవాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. గ్రామీణ క్రీడలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మరింతగా ప్రోత్సహించాలని, మతోన్మాద శక్తుల నుంచి దేశాన్ని కాపాడేందుకు యువత సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా కంభం సుజాత విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా, ప్రజానాట్య మండలి కళాకారులు ముల్లగిరి అలెగ్జాండర్, సరిపెల్లి లేని బాబు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. క్రికెట్, కబాడీ, ముగ్గులు, రన్నింగ్, మ్యూజికల్ చైర్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమాల్లో నిర్వహణ కమిటీ సభ్యులు పల్లె మున్నా, గట్టు సుధాకర్, ముల్లగిరి నాని బాబు, పిట్ట ట్రినిటీ అంబేద్కర్, ఎన్. కార్తీక్, కె. గోపీచంద్, నక్క రామకృష్ణ, కె. లోకేష్ తదితరులు పాల్గొన్నారు.















Social Plugin