రాష్ట్ర ప్రజలకు, ఏలూరు నియోజకవర్గ ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు: జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు


ఏలూరు, జనవరి 13: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ఏలూరు నియోజకవర్గ ప్రజలకు, జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, మెగా అభిమానులకు, కూటమి పార్టీల నాయకులకు ముందుగా ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ బోర్డు జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ రెడ్డి అప్పల నాయుడు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు.. 


భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ సంక్రాంతి అని పేర్కొన్నారు.. ఈ సంక్రాంతి వేడుకను ప్రజలందరూ ఆనందంగా, సంతోషంగా జరుపుకోవాలని అన్నారు.. ఈ సమయంలో యువతి,యువకులు సాంప్రదాయ పద్ధతుల్ని అనుసరిస్తూ మన హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా, చెడు వ్యసనాలకు దూరంగా, జూదాలకు ఇతర రంగాలకు పోకుండా క్రీడావైపుగా ప్రయాణించి ఈ సంక్రాంతిని మంచి ఉత్సాహంతో కుటుంబ సభ్యులు అందరితో జరుపుకోవాలని తెలియజేస్తున్నామని అన్నారు.. 

అందరూ కూడా మంచి ఆనందంగా, సంతోషంగా, సుఖసంతోషాలతో ఉండాలని ఆ దేవ దేవుని ప్రార్థిస్తూ కార్మికులకు, కర్షకులకు, వ్యాపార వాణిజ్య రంగాల వారికి, విద్యార్థిని విద్యార్థులకు, హమాళీ కార్మికులకు, మిత్రులకు , శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికీ ముందుగా భోగి సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు..