నల్లజర్లలో ‘తల్లి నీకు వందనం’ కార్యక్రమం ఘనం…
మహిళలతో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ముఖాముఖి
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల: మండలం ప్రకాష్ రావు పాలెంలో ‘తల్లి నీకు వందనం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ముఖ్యఅతిథిగా పాల్గొని మహిళలతో నేరుగా ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డ్వాక్రా మహిళలు, డ్వాక్రా సీఐలు, అంగన్వాడి, ఆశా కార్యకర్తలు కలిసి సుమారు 2,000 మంది మహిళలు పాల్గొన్నారు. మహిళల కష్టసుఖాలను ఎమ్మెల్యే ప్రత్యక్షంగా తెలుసుకుని, రాష్ట్ర సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర ఎంత కీలకమో వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ… మహిళల సాధికారతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మహిళలే ప్రధాన భాగస్వాములని అన్నారు. మహిళల ద్వారానే ప్రతి కార్యక్రమం విజయవంతమవుతుందని పేర్కొన్నారు.
అందుకే గోపాలపురం నియోజకవర్గంలో అమలు చేస్తున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. మహిళల భాగస్వామ్యం లేకుండా అభివృద్ధి సాధ్యంకాదని అన్నారు.
మహిళా సాధికారతకు బీజం వేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని, ఆయన నాయకత్వంలో మహిళలకు మరింత ప్రోత్సాహం లభిస్తోందని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సభలో పేర్కొన్నారు.















Social Plugin