గ్రామ సర్పంచ్ కె. విజయలక్ష్మి కుటుంబానికి అండగా మంత్రివర్యులు కొలుసు పార్థసారధి


నూజివీడు / ముసునూరు, జనవరి 25 : ముసునూరు మండలం ముసునూరు గ్రామ సర్పంచ్ కె. విజయలక్ష్మి భర్త యిర్మీయా ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారధి, శనివారం యిర్మీయా కుటుంబాన్ని పరామర్శించారు.


ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పేరు పేరునా పలకరించి, వారి దుఃఖాన్ని పంచుకున్న మంత్రి, ప్రభుత్వం మరియు తాను ఎల్లప్పుడూ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఈ కుటుంబానికి కూటమి ప్రభుత్వం తరపున వచ్చే అన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

యిర్మీయా కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని మంత్రివర్యులు స్పష్టం చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఈ కుటుంబానికి అండదండగా నిలుస్తుందని చెప్పారు.

ప్రభుత్వం ప్రతి వేళా ఈ కుటుంబానికి తోడుగా ఉంటుందని, తన వంతు సహాయం పూర్తిగా అందిస్తానని మంత్రి కొలుసు పార్థసారధి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రివర్యుల వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.