రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్. జవహర్‌కు ఘన స్వాగతం


ఏలూరు జిల్లా, ఏలూరు: రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్ కె.ఎస్. జవహర్ ఏలూరు జిల్లాకు ఒక్క రోజు పర్యటనకు శుక్రవారం విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానిక రెవెన్యూ అతిథిగృహంలో జిల్లా రెవెన్యూ అధికారి వి. విశ్వేశ్వర రావు ఆయనను మర్యాదపూర్వకంగా కలసి పూలమొక్కను అందజేసి ఘన స్వాగతం పలికారు.


ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళీరామకృష్ణ, ఏపీ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు పాల్గొన్నారు. అలాగే ఆర్డీవో యం. అచ్యుత అంబరీష్, జిల్లా సాంఘీక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు వై. విశ్వమోహన్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడి యం. ముక్కంటి, తహసీల్దార్ కె. గాయత్రిదేవి తదితర అధికారులు చైర్మన్‌కు స్వాగతం పలికారు.

ఇక టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షులు పెద్దాడ రమణ, ఎస్సీ–ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు తాళ్లూరి రాణి, దొడ్డిగర్ల సుభా మల్లిక్, మాజీ సభ్యులు మేతర అజయ్ బాబు, యంఆర్‌పిఎస్ నాయకులు బియ్యపు రాజేశ్వర రావు, ఎస్సీ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, మహిళలు, స్థానిక ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి చైర్మన్‌కు ఆత్మీయ స్వాగతం పలికారు.