ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం: పట్టణంలోని శ్రీనూకాలమ్మ అమ్మవారు విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ (పండు) ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావులతో కూడిన ఆలయ కమిటీ ఆధ్యర్యంలో అభివృద్ది కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
ఆలయ కళ్యాణ కళా వేదిక వద్ద, శ్రీ నర్మదా అమృత బాణ లింగేశ్వర స్వామి వారి పంచలోహ ఉత్సవలింగానికి సోమవారం సందర్భంగా పంచామృతాభిషేకలు అర్చక స్వాములు నిర్వహించారు. భక్తులు ఇతోధికంగా వెండి రూపంలో, ధన రూపంలోనూ మరియు వెండి వస్తువులు అమ్మ వారి వెండి చీర తయారీకి సమర్పించి అమ్మ వారి అనుగ్రహానికి పాత్రులు కావాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి చిటికెన రాంబాబు, హనుమంతరావు, తుమ్మలపల్లి వెంకట రమణ, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు తదితర పట్టణ ప్రముఖులు, మహిళా కమిటీ సభ్యులు సేవా బృందాల సభ్యులు. గ్రామ భక్త మహా జనులు పాల్గొని, ప్రసాద వితరణ చేసి కార్యక్రమాలను విజయవంతం చేశారనీ ఆలయ మేనేజర్ తెలియజేశారు.
















Social Plugin